పాకిస్తాన్‌కు(Pakistan) మిత్ర దేశమైన కెనడాలోనే(Canada) ఆ దేశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌ హోస్టెస్‌లు(Air Hostesses) అదృశ్యమవుతున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది. గత నెలలో ఓ ఎయిర్‌ హోస్టెస్‌ అదృశ్యం అవ్వగా తాజాగా మరో విమాన మహిళా సిబ్బంది అదృశ్యమైంది. ఇలా గత ఏడాది నుంచి ఇప్పటివరకు 9 మంది ఎయిర్‌ హోస్టెస్‌లు కెనడాలో కనిపించకుండా పోవడంతో కలకలం రేగుతోంది.

పాకిస్తాన్‌కు(Pakistan) మిత్ర దేశమైన కెనడాలోనే(Canada) ఆ దేశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌ హోస్టెస్‌లు(Air Hostesses) అదృశ్యమవుతున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది. గత నెలలో ఓ ఎయిర్‌ హోస్టెస్‌ అదృశ్యం అవ్వగా తాజాగా మరో విమాన మహిళా సిబ్బంది అదృశ్యమైంది. ఇలా గత ఏడాది నుంచి ఇప్పటివరకు 9 మంది ఎయిర్‌ హోస్టెస్‌లు కెనడాలో కనిపించకుండా పోవడంతో కలకలం రేగుతోంది. ఇస్లామాబాద్‌ నుంచి కెనడాకు వెళ్లిన పాకిస్థాన్‌ ఎయిర్‌ లైన్‌ విమానం పీకే–782లో మరియం రజా అనే ఎయిర్‌ హోస్టస్‌ టొరంటోలో దిగిన మరియం రజా.. మరుసటి రోజు విమానంలో విధులకు రాలేదు. దీంతో ఆమె బస చేసిన గదిని అధికారులు పరిశీలించారు. అక్కడ మరియం రజా డ్రెస్‌తో పాటు ‘థ్యాంక్యూ పీఐఏ’ అని రాసి ఉన్న ఓ లేఖను గుర్తించారు. పీఐఏ(PIA) అంటే 'పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ లైన్స్‌'. మరియం రజా గత పదిహేనేళ్లుగా పనిచేస్తున్నట్లు పీఐఏ అధికార ప్రతినిధి తెలిపారు. తమ సిబ్బంది టొరంటోలో అదృశ్యం కావడం ఈ ఏడాది ఇది రెండో ఘటన అని అన్నారు.

2019 నుంచే కెనడాలో పాకిస్తాన్‌ ఎయిర్‌ హోస్టెస్‌లు అదృశ్యం అవుతున్నారని తెలుస్తోంది. గడిచిన రెండు, మూడు ఏళ్ల నుంచి ఈ కేసులు మరిన్ని పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. ఏడాది సమయంలోనే ఏడుగురు పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ లైన్స్‌ సిబ్బంది కెనడాలో కనిపించకుండా పోయినట్లు అధికారులు చెప్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఓ ఉద్యోగి ఇలాగే పారిపోయి కెనడాలో స్థిరపడినట్లు చెప్తున్నారు. ఆ ఉద్యోగి ప్రోత్సాహంతోనే మిగతావారు కూడా అదే బాట పట్టినట్టు అధికారులు అంచనాలు వేస్తున్నారు. కెనడాలో సులువుగానే పౌరసత్వం పొందే అవకాశాలున్నాయని అంటున్నారు. దీంతో పాకిస్థాన్‌ విమానాల్లో పనిచేస్తున్న సిబ్బంది కెనడాకు రాగానే మాయమవుతున్నారని భావిస్తున్నారు. పాకిస్తాన్‌తో పోల్చితే కెనడా అభివృద్ధి చెందిన దేశం కావడం, అక్కడ ఏదైనా చిన్నాచితక ఉద్యోగం చేసినా లక్షల్లో వేతనాలు రావడం, పాక్‌ ఎయిర్‌లైన్స్‌లో తక్కువ వేతనాలు ఉండడమే సిబ్బంది మాయమవ్వడానికి కారణమని అంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా కెనడా అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామని పాకిస్తాన్‌ ఎయిర్‌లైన్స్‌ అధికారులు చెప్తున్నారు.

Updated On 1 March 2024 4:59 AM GMT
Ehatv

Ehatv

Next Story