పాతికేళ్లలోపు యువత గుండెలు కూడా ఆకస్మాత్తుగా ఆగిపోతున్నాయి. ఈ మధ్య ఇలాంటి విషాదభరిత సంఘటనలు అనేకం జరిగాయి.

పాతికేళ్లలోపు యువత గుండెలు కూడా ఆకస్మాత్తుగా ఆగిపోతున్నాయి. ఈ మధ్య ఇలాంటి విషాదభరిత సంఘటనలు అనేకం జరిగాయి. లేటెస్ట్‌గా ఓ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌(Badminton player) కోర్టులోనే తుది శ్వాస విడిచాడు. ఇండోనేషియాలో(Indonesia) జరుగుతున్న ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. చైనాకు చెందిన 17 ఏళ్ల ఝాంగ్‌ జిఝి(Zhang Zhijie) జపాన్‌కు(Japan) చెందిన కజుమా కవానోతో పోటీపడ్డాడు. మ్యాచ్‌ రసకందాయంలో పడటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. సరిగ్గా అదే సమయంలో ఝాంగ్‌ జిఝి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న సిబ్బంది వెంటనే రియాక్టయ్యారు. ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఝాంగ్‌ జిఝి మరణం పట్ల ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story