తప్పు చేసినా తప్పించుకుని తిరగడం మన దగ్గర సాధ్యపడుతుందేమో కానీ సింగపూర్‌లో(Singapore) ఆ పప్పులేమీ ఉడకవు. కరోనా నిబంధనలు పాటించనందుకు భారతీయ సంతతికి చెందిన 64 ఏళ్ల తమిళ్‌ సెల్వం(Selvam) అనే వ్యక్తికి రెండు వారాల జైలు శిక్ష పడింది. ఈయన కరోనా నిబంధనలు(Corona Regulations) పాటించకపోవడంతో సహోద్యోగులను చాలా ఇబ్బందులు పెట్టాడట! సింగపూర్‌లోని ఓ కంపెనీలో తమిళ్‌ సెల్వం క్లీనర్‌గా పని చేస్తున్నాడు. అతడికి 2021, అక్టోబర్‌ 18న ఆరోగ్యం బాగోలేకపోతే కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు.

తప్పు చేసినా తప్పించుకుని తిరగడం మన దగ్గర సాధ్యపడుతుందేమో కానీ సింగపూర్‌లో(Singapore) ఆ పప్పులేమీ ఉడకవు. కరోనా నిబంధనలు పాటించనందుకు భారతీయ సంతతికి చెందిన 64 ఏళ్ల తమిళ్‌ సెల్వం(Selvam) అనే వ్యక్తికి రెండు వారాల జైలు శిక్ష పడింది. ఈయన కరోనా నిబంధనలు(Corona Regulations) పాటించకపోవడంతో సహోద్యోగులను చాలా ఇబ్బందులు పెట్టాడట! సింగపూర్‌లోని ఓ కంపెనీలో తమిళ్‌ సెల్వం క్లీనర్‌గా పని చేస్తున్నాడు. అతడికి 2021, అక్టోబర్‌ 18న ఆరోగ్యం బాగోలేకపోతే కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. అందులో కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. అతడు నేరుగా ఇంటికి వెళ్లకుండా సమాచారాన్ని తెలిపేందుకు లాజిస్టిక్‌ ఆఫీసుకు వెళ్లాడు. అక్కడ ఉన్న ఉద్యోగులు తమిళ సెల్వంను ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. కానీ అతడు ఇంటికి వెళ్లకుండా దగ్గుతూ అక్కడే తిరిగాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇతడి చేష్టలకు సహోద్యోగులు ఇబ్బందికి గురయ్యారు. వారిలో ఒకరు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. పాపం అతడైతే బాగా సఫరయ్యాడు. అయితే ఈ ఘటన తర్వాత ఎవరికీ కోవిడ్‌ రాలేదు కానీ ఇబ్బందులైతే పడ్డారు. ఈ వ్యవహారంపై వారంతా కలిసి పోలీసులకు కంప్లయింట్‌ చేశారు. కరోనాను తమిళ్‌ సెల్వం సీరియస్‌గా తీసుకోలేదని భావించిన కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. రెండు వారాల జైలు శిక్ష విధించింది. నిజానికి సింగపూర్‌లో కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు కనీసం ఆరు నెలల జైలు శిక్షతో పాటు పది వేల సింగపూర్‌ డాలర్ల జరిమానా విధిస్తారు.

Updated On 19 Sep 2023 6:28 AM GMT
Ehatv

Ehatv

Next Story