ఉద్యోగానికి(Jobs) కావాల్సిన అర్హతలు మంచి చదువు, అనుభవం..

ఉద్యోగానికి(Jobs) కావాల్సిన అర్హతలు మంచి చదువు, అనుభవం.. అంతే తప్ప ఏ ముహూర్తంలో పుట్టాడు? ఏ రాశిలో(rasi)(Zodiac sign) పుట్టాడు? అన్నది కాదుగా ! అసలు ఎవరైనా రాశిఫలాలు చూసి, జాతకచక్రాలు చూసి ఉద్యోగాలు ఇస్తారా? కానీ చైనాలోని(china) ఓ కంపెనీ మాత్రం తాము అలాగే ఇస్తామంటోంది. ఆ కంపెనీ విడుదల చేసిన ఉద్యగ ప్రకటనలో కూడా అదే చెప్పింది. ఇయర్‌ ఆఫ్‌ ది డాగ్‌(Year Of the Dog) రాశిలో పుట్టిన వారు అప్లై చేయకూడదని, చేసినా తాము యాక్సెప్ట్‌ చేయమని చెప్పింది. తక్కువ అర్హతలు ఉన్నా వేరే రాశిలో జన్మించిన వారిని చక్కగా ఉద్యోగాల్లో తీసుకుంటామని తెలిపింది. చైనాలోని గాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని సాంక్సింగ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ క్లర్క్‌ ఉద్యోగాల కోసం ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటనలో ఇయర్‌ ఆఫ్‌ ద డాగ్‌లో పుట్టిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోమని స్పష్టం చేసింది. అందుకు కారణం కూడా చెప్పుకుంది. కంపెనీ బాస్‌ రాశి డ్రాగన్‌ అట! దానికి ఇయర్‌ ఆఫ్‌ ది డాగ్‌కు పొంతన కుదరదట! వాళ్లను ఉద్యోగాల్లో తీసుకుంటే కంపెనీకి నష్టం వస్తుందట! కంపెనీవారి లాజిక్‌ చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు

Updated On
Eha Tv

Eha Tv

Next Story