భార్య మీద ప్రేమను కనబర్చడానికి షాజహాన్‌ తాజ్‌మహల్‌ నిర్మించాడు.

భార్య మీద ప్రేమను కనబర్చడానికి షాజహాన్‌ తాజ్‌మహల్‌ నిర్మించాడు.

ఆయన రాజు కాబట్టి తల్చుకుంటే డబ్బులకు కొదవుండదు కాబట్టి కుదిరింది. అవును మరి డబ్బున్న వారు ఏమైనా చేయగలరు జమాల్‌ అల్ నదాక్‌(Jamal Al Nadak) మాదిరిగా! తన భార్యకు ప్రేమగా చీరలో, నగలో, కార్లో కొనిపెట్టలేదాయన! ఆమె బికినీ వేసుకోవాలని ముచ్చటపడితే, అది వేసుకోవడానికి ఏకంగా ఓ ద్వీపాన్నే కొనేశాడు. జమాల్‌ అల్‌ నదాక్‌ దుబాయ్‌కు చెందిన మిలియనీర్‌. ఆయన భార్య సౌదీ అల్‌ నదాక్‌(Soudi Al Nadak). ఆమెకు బికినీ వేసుకోవాలనే కోరిక కలిగింది. అది వేసుకోవడానికి ప్రైవసీ ఉండాలి కదా! అందుకే హిందు మహా సముద్రంలో ఓ ద్వీపాన్ని కొన్నాడా భర్త! అందుకోసం ఆయన మన కరెన్సీలో 418 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశాడు. ఈ విషయాన్ని సౌదీ అల్‌ నదాక్‌ స్వయంగా చెప్పింది. 'నేను బికినీ వేసుకోవాలనుకుంటే, నా మిలియనీర్‌ భర్త ఓ ద్వీపాన్నే కొనుగోలు చేశారు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఇంకా ఆమె ఏం రాసిందంటే 'దీర్ఘకాల పెట్టుబడి గురించి మేమిద్దరం ఆలోచించాం. అదే సమయంలో గోప్యతపైనా దృష్టిపెట్టాం. నేను బీచ్‌లో సురక్షితంగా సేదతీరాలనేది నా భర్త కోరిక. దానినుంచే ఐలాండ్‌ను సొంతం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది’అని పేర్కొంది.

Updated On
ehatv

ehatv

Next Story