వివాహేతర సంబంధం(Extra Marital Affair) పెట్టుకుంటున్నారా? కట్టుకున్న భార్యకు విడాకులిచ్చేసి జల్సా చేద్దామనుకున్నారా? అయితే మీ ఉద్యోగం ఊడినట్టే! భయంతో కూడిన కంగారు పడకండి.. ఇది ఇక్కడ కాదు.. చైనాలో(China)! ఆ దేశంలోని జీజియాంగ్‌లో(Jijiyang) ఉన్న ఓ కంపెనీ తమ ఉద్యోగులెవరైనా వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్టు తెలిస్తే వారిని ఉద్యోగం నుంచి పీకేస్తామని హెచ్చరించింది. వ్యక్తిగత జీవితం వేరు, వృత్తిపరమైన జీవితం వేరే అంటూ లాజిక్కులు మాట్లాడే ఛాన్స్‌ లేదక్కడ.

వివాహేతర సంబంధం(Extra Marital Affair) పెట్టుకుంటున్నారా? కట్టుకున్న భార్యకు విడాకులిచ్చేసి జల్సా చేద్దామనుకున్నారా? అయితే మీ ఉద్యోగం ఊడినట్టే! భయంతో కూడిన కంగారు పడకండి.. ఇది ఇక్కడ కాదు.. చైనాలో(China)! ఆ దేశంలోని జీజియాంగ్‌లో(Zhejiang) ఉన్న ఓ కంపెనీ తమ ఉద్యోగులెవరైనా వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్టు తెలిస్తే వారిని ఉద్యోగం నుంచి పీకేస్తామని హెచ్చరించింది. వ్యక్తిగత జీవితం వేరు, వృత్తిపరమైన జీవితం వేరే అంటూ లాజిక్కులు మాట్లాడే ఛాన్స్‌ లేదక్కడ. ఆఫీసయ్యాక ఇష్టమొచ్చినట్టు ఉంటామంటే కుదరదక్కడ. పైగా ఉద్యోగులలో నైతికతను పెంపొందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ కంపెనీ అంటోంది.

వివాహేతర సంబంధాల కారణంగా వారి దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడతాయని, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకుంటే ప్రశాంతత లోపిస్తుందని. ఫలితంగా వారు పనిపై ఏకాగ్రత చూపరని కంపెనీ వివరణ ఇచ్చుకుంది. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, ఉంపుడుగత్తెలు ఉండటం, విడాకులు తీసుకోవడం వంటివాటిని కంపెనీ నిషేధించింది. ఈ నిబంధనలు పాటిస్తే గనక మంచి ఉద్యోగులుగా, మంచి వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారని తెలిపింది. అయితే కంపెనీ నిర్ణయంపై చైనాలో మిశ్రమ స్పందన వస్తోంది. ఉద్యోగుల వ్యక్తిగత జీవితంపై కంపెనీలకు ఎలాంటి హక్కు ఉండదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కొందరు మాత్రం ఈ నిబంధన కారణంగా కుటుంబ విలువలు నిలబడతాయని వాదిస్తున్నారు.

Updated On 19 Jun 2023 2:50 AM GMT
Ehatv

Ehatv

Next Story