అమెరికా షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై అదానీ గ్రూప్‌ వివరణ ఇచ్చుకుంది.

అమెరికా షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై అదానీ గ్రూప్‌ వివరణ ఇచ్చుకుంది. అవన్నీ అవాస్తవాలని, కుట్రపూరితమైనవని తెలిపింది. వ్యక్తిగత లాభం కోసం తప్పుడు ప్రచారం చేస్తూ మదుపరులను తప్పుతోవపట్టిస్తున్నదని అదానీ గ్రూప్‌ పేర్కొంది. అదానీ గ్రూప్‌ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్‌ ఫండ్‌లలో సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్‌ తాజాగా ఆరోపించిన నేపథ్యంలో కంపెనీ అధికార ప్రతినిధి వివరణ ఇచ్చుకున్నారు. హిండెన్‌బర్గ్‌ (Hindenburg Research) చేసిన ఆరోపణలపై ఇప్పటికే సమగ్ర దర్యాప్తు జరిగిందని చెబుతూ అవన్నీ అవాస్తవాలని తేలిందని వివరించింది. సుప్రీంకోర్టు కూడా క్లీన్‌చిట్ ఇచ్చినట్టు తెలిపింది. అయినా హిండెన్‌బర్గ్‌ మాత్రం పదే పదే ఆరోపణలు చేస్తున్నదని అదానీ సంస్థ ప్రతినిధి తెలిపారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story