Madison Marsh : ఎయిర్‌ఫోర్స్ అఫీసర్‌కు మిస్ అమెరికా టైటిల్!
మిస్ అమెరికా(Miss America) అందాల పోటీలో(Beauty Contest) కొలరాడోకు చెందిన 22 ఏళ్ల మాడిసన్ మార్ష్(Madison Marsh) విజయం సాధించి కిరీటాన్ని సంపాదించింది. ఎయిర్‌ఫోర్స్ అధికారిణిగా(Air Force Officer) బాధ్యతలునిర్వర్తిస్తూనే మిస్ అమెరికా టైటిల్ గెల్చుకోవడం ద్వారా మాడిసన్ మార్ష్ చరిత్ర సృష్టించింది. 2023లో ఈమె మిస్ కొలరాడో(Miss colorado) కిరీటం కూడా గెల్చుకుంది.
మిస్ అమెరికా(Miss America) అందాల పోటీలో(Beauty Contest) కొలరాడోకు చెందిన 22 ఏళ్ల మాడిసన్ మార్ష్(Madison Marsh) విజయం సాధించి కిరీటాన్ని సంపాదించింది. ఎయిర్‌ఫోర్స్ అధికారిణిగా(Air Force Officer) బాధ్యతలునిర్వర్తిస్తూనే మిస్ అమెరికా టైటిల్ గెల్చుకోవడం ద్వారా మాడిసన్ మార్ష్ చరిత్ర సృష్టించింది. 2023లో ఈమె మిస్ కొలరాడో(Miss colorado) కిరీటం కూడా గెల్చుకుంది. ఎయిర్‌ఫోర్స్ అకాడమీ నుంచి ఫిజిక్స్‌లో పట్టా పొందే కొన్ని రోజుల ముందే ఈ టైటిల్ గెల్చుకోవడం విశేషం. ఓ పక్క ఎయిర్‌ఫోర్స్‌లో రెండో లెఫ్టినెంట్‌గా(lieutenant) కఠినతరమైన బాధ్యతలను చేపడుతూనే మిస్ హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ కూడా చేస్తున్నారు మార్ష్. ఇంత బిజీగా ఉంటూ అమెరికా అందాల పోటీకి ప్రీపేర్ అయ్యారు. తనకు ఇష్టమైన రెండు భిన్నమైన రంగాలలో విజయాలను అందుకోవడం అద్భుతంగాఉందని మార్ష్ అంటోంది. 'మీకు ఆకాశమే హద్దు. మిమ్మల్ని నిలువరించేవారే లేరు. రెండు పడవల మీద కాలు వేయలేం అనే వారికి నా విజయమే సమాధానం. మీ అభిరుచి ఎంతటి కష్టమైనా తట్టుకుని సాధించేలా చేయగలదు' అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది మార్ష్. 'మీపై మీకు నమ్మకం ఉంటే మిమ్మల్ని మీరు ఒక్కచోటకే పరిమితం చేయాల్సిన పని లేదు. ధైర్యంగా అడుగు వేయండి' అని మార్ష్ తెలిపింది. ఎయిర్‌ఫోర్స్‌లో జాయిన్ అయ్యేందుకు తీసుకున్న ఫిజికల్ ట్రైనింగ్ మిస్ అమెరికా పోటీ కోసం ఎంతగానో ఉపకరించిందని మాడిసన్ మార్ష్ తెలిపింది.