పది మందిలో గుర్తింపు తెచ్చుకోవాలన్న కోరికో, స్టంట్స్‌(Stunts) చేయాలన్న పిచ్చో తెలియదు కానీ కొందరు బైకులను(Bikes), కార్లను(Cars) ఇష్టారాజ్యంగా నడిపేస్తుంటారు. కోరి ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు. అదే సమయంలో ఇతరులను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు.

పది మందిలో గుర్తింపు తెచ్చుకోవాలన్న కోరికో, స్టంట్స్‌(Stunts) చేయాలన్న పిచ్చో తెలియదు కానీ కొందరు బైకులను(Bikes), కార్లను(Cars) ఇష్టారాజ్యంగా నడిపేస్తుంటారు. కోరి ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు. అదే సమయంలో ఇతరులను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు సోషల్‌ మీడియాలో(Social media) మనకు చాలానే కనిపిస్తుంటాయి. లేటెస్ట్‌గా అమెరికాలో(America) ఓ యువతి ఇలాగే ప్రమాదకరంగా డ్రైవ్‌ చేసి తన స్నేహితుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఈ యాక్సిడెంట్‌(Accident Video) వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతోంది. కొలరాడో స్ప్రింగ్స్‌లోని ఓ మాల్‌ వెలుపల ఉన్న పార్కింగ్‌ ప్రాంతంలో ఓ యువతి ఎస్‌యూవీ(SUV Car) కారును ప్రమాదకరంగా నడపడంతో అది ఒక్కసారిగా బోల్తా పడింది. అయిదుగురు యువతీ యువకులు ఆ కారు డోర్లపై వేలాడుతూ ఉండగా, కారును వేగంగా వెనక్కి తిప్పింది. దాంతో కారు పల్టీ కొట్టింది. కారు డోర్లపై నిల్చున్నవారు కారు కింద నలిగిపోయారు. ప్రమాదానికి కారణమైన ఆ యువతని కొలరాడో స్ప్రింగ్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేశారు. కారు డ్రైవ్‌ చేసిన యువతికి స్వల్పగాయాలు అయ్యాయి. కానీ కారు కింద పడినవారికే తీవ్ర గాయాలయ్యాయి.

Updated On 20 Dec 2023 2:10 AM GMT
Ehatv

Ehatv

Next Story