ఫెంటానిల్‌ ఐవీలను(Fentanyl ivy) ఓ నర్సు(Nurse) దొంగతనం చేసింది. వాటి స్థానంలో ఐవీలను నీటితో(Water) నింపి రోగులకు ఎక్కించింది. దీంతో అంటువ్యాధుల బారిన పడిన రోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నర్సు చేసిన పాపపు పనికి 10 మంది రోగులు మృత్యువాత పడ్డారు. అమెరికాలోని ఓరెగాన్‌లో(Oregon) ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అమెరికాలోని మెడ్‌ఫోర్డ్‌లో అసంటే రోగ్‌ రిజినల్ మెడికల్‌ సెంటర్‌లో(Asante Rogue Regional Medical Centre) పనిచేసిన మాజీ నర్సు చేసిన పనికి పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు. నర్సుపై గత నెలలో పోలీసులకు ఈ ఆస్పత్రి అధికారులు ఫిర్యాదు చేశారు. రోగుల నొప్పి నివారించేందుకు ఉపయోగించాల్సిన ఫెంటానిల్‌ ఐవీలను దొంగిలించి.. వాటిని ట్యాప్‌ వాటర్‌తో నింపి రోగులకు ఎక్కించేదని విచారణలో తేలింది. దీంతో రోగులు అంటువ్యాధుల బారినపడి దాదాపు 10 మంది వరకు చనిపోయారని ఫిర్యాదులో అధికారులు పేర్కొన్నారు. 2022 నుంచి ఆ నర్సు ఈ పనిచేస్తూ వచ్చిందని.. దీంతో ఆస్పత్రిలో రోగులు చనిపోయినట్లు ఫిర్యాదులో అధికారులు తెలిపారు.

Updated On 6 Jan 2024 5:47 AM GMT
Ehatv

Ehatv

Next Story