ఈ ఫలితాలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కేరిన్ జీన్ పియరే మాట్లాడుతూ

పాకిస్థాన్‌ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. హంగ్ ఏర్పడడంతో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ, బిలావల్ భుట్టో-జర్దారీ సారథ్యంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చేతులు కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. తన సోదరుడు షేబాజ్ షరీఫ్‌ను నవాజ్ షరీఫ్ ప్రధాని అభ్యర్థిగా సూచించారు.

పాక్ మాజీ ప్రధాని, ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పవర్ షేరింగ్ ఒప్పందాన్ని ఖండించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పీపీపీ 53 స్థానాలు గెలుచుకోగా, పీఎంఎల్-ఎన్ 75 స్థానాలు గెలుచుకుంది. ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పీటీఐ గుర్తును ఈసీ రద్దు చేయడంతో ఆ పార్టీ నేతలంతా స్వతంత్రంగా బరిలోకి దిగి 101 స్థానాల్లో గెలుపొందారు. 265 సీట్లు కలిగిన పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 133 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి కూడా మెజార్టీ మార్కు దక్కకపోవడంతో నవాజ్, పీపీపీ చేతులు కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. ఈ ఎన్నికల్లో 17 స్థానాల్లో గెలుపొందిన ముత్తాహిదా క్వామి మూవ్‌మెంట్ పాకిస్థాన్ (ఎంక్యూఎం-పీ) కూడా షేబాజ్ షరీఫ్‌కు మద్దతు ప్రకటించింది.

ఈ ఫలితాలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కేరిన్ జీన్ పియరే మాట్లాడుతూ.. పాకిస్థాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై ప్రెసిడెంట్ జో బైడెన్ కు పూర్తి అవగాహన ఉందని.. ఎన్నికలలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్న పాక్ ప్రజలకు బైడెన్ అభినందనలు తెలిపారన్నారు. ఫలితాలు వెల్లడించాక చోటుచేసుకున్న ఘటనలపై బైడెన్ విచారం వ్యక్తం చేశారని చెప్పారు. ఏ పార్టీకి ప్రజలు పూర్తి మెజారిటీ ఇవ్వకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజా తీర్పును గౌరవించాలని, ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని బైడెన్ పాకిస్థాన్ లోని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారని తెలిపారు.

Updated On 14 Feb 2024 1:15 AM GMT
Yagnik

Yagnik

Next Story