అమెరికా(America), బ్రిటన్‌(Britain) జరిపిన వైమానిక దాడులతో యెమెన్‌(Yemen) దేశం ఉలిక్కిపడింది. హౌతీ తిరుగుబాటుదారులే లక్ష్యంగా గురువారం అమెరికా, బ్రిటన్‌లు దాడులు జరపడమే కాకుండా హౌతీలపై(Houthis) తదుపరి చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించాయి. ఎర్ర సముద్రంలో(Red Sea) ఓడలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్న సంగతి విదితమే! ఇజ్రాయెల్(Israel) దాడులపై పాలస్తీనా(Palestines0 ఇస్లామిస్ట్ గ్రూపు హమాస్‌కు మద్దతుగా హౌతీలు ఎర్రసముద్రంలో ఓడలపై దాడులు చేస్తున్నారు.

అమెరికా(America), బ్రిటన్‌(Britain) జరిపిన వైమానిక దాడులతో యెమెన్‌(Yemen) దేశం ఉలిక్కిపడింది. హౌతీ తిరుగుబాటుదారులే లక్ష్యంగా గురువారం అమెరికా, బ్రిటన్‌లు దాడులు జరపడమే కాకుండా హౌతీలపై(Houthis) తదుపరి చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించాయి. ఎర్ర సముద్రంలో(Red Sea) ఓడలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్న సంగతి విదితమే! ఇజ్రాయెల్(Israel) దాడులపై పాలస్తీనా(Palestines0 ఇస్లామిస్ట్ గ్రూపు హమాస్‌కు మద్దతుగా హౌతీలు ఎర్రసముద్రంలో ఓడలపై దాడులు చేస్తున్నారు. హౌతీలు ఇప్పటి వరకు ఎర్రసముద్రంలో 27 నౌకలపై దాడి చేశారు. ప్రపంచ నౌకా వాణిజ్యంలో 15% వాటా కలిగిన యూరప్-ఆసియా మధ్య కీలక మార్గంలో అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం ఏర్పడుతోంది. తమ దేశపు నౌకలతో పాటు తమ భాగస్వాముల ఓడలు, సిబ్బందిపై హౌతీల దాడులను సహించబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. ఎర్రసముద్రంలో వాణిజ్య రవాణాలపై దాడులను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. ఎర్ర సముద్రంలో వాణిజ్య ఓడలపై దాడులు చేస్తున్న హౌతీల సామర్థ్యం దెబ్బతీయడానికి ఇదే ముందుస్తు సూచన అని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. యెమెన్‌ రాజధాని సనాతో పాటు సాదా, ధమర్‌, హోడెయిడా గవర్నరేట్‌లో దాడులు జరిగినట్టు హౌతీ అధికారులు తెలిపారు. ఈ దాడులనుఅమెరికా-జియోనిస్టు-బ్రిటిష్‌ దురాక్రమణ అని ఆరోపించారు.

Updated On 12 Jan 2024 12:43 AM GMT
Ehatv

Ehatv

Next Story