Modi Statue : 190 అడుగుల ఎత్తుతో మోదీ విగ్రహం
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంకు నరేంద్రమోదీ(Narendra Modi) పేరు పెట్టేశారు. ఇప్పుడు ఆయనకు ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అసోం(Assam)కు చెందిన వ్యాపారవేత్త నబీన్ చంద్రబోరా(Nabin Chandra Bora) ఈ విగ్రహానికి అయ్యే ఖర్చును భరిస్తున్నారు.

Modi Statue
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంకు నరేంద్రమోదీ(Narendra Modi) పేరు పెట్టేశారు. ఇప్పుడు ఆయనకు ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అసోం(Assam)కు చెందిన వ్యాపారవేత్త నబీన్ చంద్రబోరా(Nabin Chandra Bora) ఈ విగ్రహానికి అయ్యే ఖర్చును భరిస్తున్నారు. సుమారు 200 కోట్ల రూపాయలతో తన సొంత స్థలంలో మోదీ విగ్రహాన్ని(Modi Statue) ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పీఎంవోకు పంపించారు నబీన్. అక్కడ్నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో భూమి పూజ చేశారు. విగ్రహాన్ని ప్రధానమంత్రి మోదీ(PM Modi) చేతుల మీదుగా ఆవిష్కరింపచేయాలన్నది నబీన్ ఆలోచన!
