అగ్రరాజ్యం అమెరికాను(America) ప్రకృతి విపత్తులు వణికిస్తున్నాయి. ఓ చోట వరదలు పోటెత్తుతుంటే మరోచోట ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఇంకో చోట భీకరమైన కార్చిచ్చు కలవరపెడుతోంది. హవాయి ద్వీపంలోని(Island of Hawaii) లహైనా రిసార్ట్‌(Lahaina Resort) నగరంలో దావానలం బీభత్సం సృష్టించింది. ఈ మంటలకు 36 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయాల పాలయ్యారు. హరికేన్‌ ప్రభావంతో బలమైన గాలులు వీస్తుండటంతో కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోందని మౌయి కౌంటీ అధికారులు చెబుతున్నారు.

అగ్రరాజ్యం అమెరికాను(America) ప్రకృతి విపత్తులు వణికిస్తున్నాయి. ఓ చోట వరదలు పోటెత్తుతుంటే మరోచోట ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఇంకో చోట భీకరమైన కార్చిచ్చు కలవరపెడుతోంది. హవాయి ద్వీపంలోని(Island of Hawaii) లహైనా రిసార్ట్‌(Lahaina Resort) నగరంలో దావానలం బీభత్సం సృష్టించింది. ఈ మంటలకు 36 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయాల పాలయ్యారు. హరికేన్‌ ప్రభావంతో బలమైన గాలులు వీస్తుండటంతో కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోందని మౌయి కౌంటీ అధికారులు చెబుతున్నారు. మంటల ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు 217 భవనాలు ధ్వంసమయ్యాయి. వాహనాలు కాలి బూడిదయ్యాయి. చాలా మంది భవనాల్లో, కార్లలో చిక్కుకుని ఉన్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆకాశం నిండా దట్టమైన పొగ అలుముకుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం రాత్రి నుంచి కార్చిచ్చు వ్యాపిస్తోంది. నలువైపుల నుంచి మంటలు చుట్టుముట్టడంతో ద్వీపంలోని పశ్చిమ భాగానికి ఇతర ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. 16 రోడ్లను మూసివేశారు. అందుబాటులో ఉన్న ఓకే ఒక్క హైవేలోనే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంటలకు తాళలేక కొందరు పసిఫిక్‌ మహా సముద్రంలో దూకి పారిపోతున్నారు. మంటలను అదుపు చేయడానికి రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Updated On 10 Aug 2023 6:17 AM GMT
Ehatv

Ehatv

Next Story