దాదాపు పదేళ్ల కిందట జరిగిన హత్య. ఇప్పటి వరకు హంతకుడి ఆచూకీని కనిపెట్టలేకపోయారు.

దాదాపు పదేళ్ల కిందట జరిగిన హత్య. ఇప్పటి వరకు హంతకుడి ఆచూకీని కనిపెట్టలేకపోయారు. ఇప్పుడా హంతకుడి వివరాలు ఎవరైనా చెబితే అయిదున్నర కోట్ల రూపాయల బహమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బెంగళూరుకు చెందిన 41 ఏళ్ల ప్రభా అరుణ్‌కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తూ ఉండేవారు. ఆమెను 2015 మార్చి 7వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి ఎవరో గొంతులో కత్తితో పొడిచి హత్య చేశాడు. హత్య జరిగి సుమారు పదేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు హంతకుడి వివరాలు, ఆచూకీ ఆస్ట్రేలియా పోలీసులు కనిపెట్టలేకపోయారు. హంతకుడి ఆచూకీ చెప్పిన వారికి మిలియన్‌ డాలర్ల బహుమతి ఇస్తామంటూ ఆస్ట్రేలియా(Australia)లోని న్యూ సౌత్‌వేల్స్‌(New South Wells) ప్రభుత్వం ప్రకటించింది. ఎంత అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 5.57 కోట్ల రూపాయలు! బెంగళూరు(Bengaluru)లోని మైండ్‌ ట్రీ (Mind Tree) కంపెనీలో పని చేస్తున్న ప్రభా అరుణ్‌కుమార్‌(Prabha Arun Kumar) ఆఫీసు పని మీద సిడ్నీ(Sydney)కి వెళ్లారు. అక్కడ విధులు ముగించుకుని బెంగళూరులో ఉన్న భర్తతో ఫోన్‌లో మాట్లాడుతూ ఇంటికి నడిచి వెళుతున్న సమయంలో తనను ఎవరో వెంటపడుతున్నారని, తర్వాత ఫోన్‌ చేస్తానని చెప్పి ఫోన్‌ కట్‌ చేశారు. తన ఇంటికి 300 మీటర్ల దూరంలో ఆమె హత్యకు గురయ్యారు. ఆ ఘాతుకానికి తలపెట్టింది ఎవరన్నది ఇప్పటికీ తెలియలేదు. ఇండియాలో కూడా హంతకుడి కోసం గాలిస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story