టర్కీ పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చింది కాబట్టి టర్కీ ఆపిల్స్‌ను బ్యాన్ చేశాం.

టర్కీ పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చింది కాబట్టి టర్కీ ఆపిల్స్‌ను బ్యాన్ చేశాం.టర్కీ ఆపిల్స్‌(Turkey Apples)ను 3 నెలల పాటు అమ్ముతారు.ఆ 3 నెలల్లో దాదాపు రూ. 1200-1500 కోట్ల వ్యాపారం జరుగుతుంది.ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)సందర్భంగా భారత్ పైకి పాకిస్థాన్(Pakistan) పంపిన డ్రోన్లను తుర్కియే సరఫరా చేసిందని తెలియడంతో దేశ ప్రజలు మండిపడుతున్నారు. రెండేళ్ల కింద తుర్కియేలో భూకంపం (Earthquake)వచ్చినప్పుడు ముందుగా భారత్ సాయం చేసినా తుర్కియేకు కనీస కృతజ్ఞత లేదని దుయ్యబడుతున్నారు. ఈ క్రమంలోనే తుర్కియే నుంచి వచ్చే వస్తువులను బ్యాన్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. మహారాష్ట్ర(Maharashtra)లోని పుణెలో వ్యాపారులు తుర్కియే యాపిల్స్ ను బహిష్కరించారు. పాకిస్థాన్ కు సాయం చేసిన తుర్కియే పండ్లను విక్రయించబోమని తేల్చి చెప్పారు.

Updated On
ehatv

ehatv

Next Story