బంగ్లాదేశ్‌(Bangladesh) స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ (All-Rounder Shakib Al Hasan)మరోసారి చిక్కుల్లో పడ్డాడు.

బంగ్లాదేశ్‌(Bangladesh) స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ (All-Rounder Shakib Al Hasan)మరోసారి చిక్కుల్లో పడ్డాడు. అతడిపై హత్య కేసు నమోదయ్యింది. బంగ్లాదేశ్‌ అల్లర్ల నేపథ్యంలో షేక్‌ హసీనా(Sheikh Hasina)ప్రభుత్వం రద్దయ్యింది. ఆ పార్టీ ఎంపీగా ఉన్న షకీబ్‌ తన పదవిని కోల్పోయాడు. ఇప్పుడేమో అతడిపై హత్య కేసు నమోదయ్యింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న హింసాత్మక అల్లర్లలో రూబెల్‌ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. రూబెల్‌ తండ్రి రఫీకుల్‌ ఇస్లామ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రఫీకుల్‌ ఫిర్యాదు ఆధారంగా షేక్‌ హసీనాతో పాటు 154 మందిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఇందులో షకీబ్‌ 28వ నిందితుడిగా ఉన్నాడు. బంగ్లాదేశ్‌ ప్రముఖ నటుడు ఫెర్దూస్‌ అహ్మద్‌ను 55వ నిందితుడిగా చేర్చారు. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో వీరిద్దరు షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ పార్టీ (Awami League party)తరఫున ఎంపీలుగా గెలిచారు. అల్లర్ల నేపథ్యంలో హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఆమె ప్రభుత్వం రద్దయ్యింది. దీంతో వీరు పదవిని కోల్పోయారు. బంగ్లాదేశ్‌లో అల్లర్లు, హసీనా రాజీనామా చేసినప్పటి నుంచి షకీబ్‌ కెనడా(canada)లో ఉంటున్నాడు. మీడియాతో కూడా మాట్లాడటం లేదు. కెనడా నుంచి నేరుగా పాకిస్థాన్‌ వెళ్లి జట్టుతో కలిశాడు.

Updated On
ehatv

ehatv

Next Story