ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) వారణాసిలో(Varanasi) ఓ వ్యక్తి శ్వాసనాళంలో పావలా బిళ్ల(Coin) ఇరుక్కుపోయింది.

ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) వారణాసిలో(Varanasi) ఓ వ్యక్తి శ్వాసనాళంలో పావలా బిళ్ల(Coin) ఇరుక్కుపోయింది. ఎనిమిదేళ్ల పాటు ఆ నాణాన్ని శ్వాసనాళంలోనే ఉంచుకున్నాడు. ఇబ్బంది ఉన్నా భరించాడు. చివరకు మొన్న సర్జరీ ద్వారా బయటకు తీశారు డాక్టర్లు. 40 ఏళ్ల వ్యక్తి విండ్‌పైప్‌లో ఉన్న 25 పైసల నాణన్ని బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలోని సుందర్‌లాల్ హాస్పిటల్‌ డాక్టర్లు బయటకు తీశారు. ఎనిమిదేళ్లుగా ఆ నాణెం అక్కడ ఉందని తెలుసుకుని దిగ్భ్రాంతి చెందారు. పెద్దలకు శ్వాసనాళంలోకి వస్తువులు వెళ్లడం అసాధారణమని చెబుతున్న డాక్టర్లు ఇలాంటి వాటి వల్ల ప్రాణహాని కలుగవచ్చంటున్నారు. ఊపిరితిత్తులను దెబ్బతీయం, న్యుమోనియాకు దారి తీయడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఇతర సమస్యల వల్ల కూడా పేషంట్లు చనిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యనే మరో వ్యక్తి శ్వాసనాళంలో పదేళ్లుగా చిక్కుకుని ఉన్న అల్మారా తాళం చెవిని కూడా బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం డాక్టర్లు బయటకు తీశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story