H1B Visa News : అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు ఊరట..!
అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది.

అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. USలో చదువుతున్న వారికి హెచ్-1బీ వీసా ఫీజు నుంచి సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ మినహాయింపు కల్పించింది. అమెరికా బయటి నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే లక్ష డాలర్లు చెల్లించాలని స్పష్టం చేసింది. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు హెచ్-1బీ వీసా సంబంధిత భారీ ఊరట లభించింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 19, 2025న ప్రకటించిన ప్రకటన ప్రకారం, హెచ్-1బీ వీసా కోసం కొత్త దరఖాస్తులు చేసే వారికి $100,000 (సుమారు రూ. 84 లక్షలు) అదనపు ఫీజు విధించాలని నిర్ణయించారు. అయితే, US సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అక్టోబర్ 20, 2025న విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, అమెరికాలో ఇప్పటికే చదువుతున్న లేదా పని చేస్తున్న వారికి ఎఫ్-1 స్టూడెంట్ వీసా లేదా ఇతర చెల్లుబాటైన స్టేటస్‌లో ఉన్నవారు, ఈ ఫీజు మినహాయించారు. అమెరికా బయటి నుంచి కొత్తగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసే వారికి మాత్రమే $100,000 ఫీజు వర్తిస్తుంది. ఇది 2026 లాటరీ సహా సెప్టెంబర్ 21, 2025 తర్వాత దరఖాస్తులకు వర్తిస్తుంది. ఇది టెక్నాలజీ, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో అమెరికాలో ఉద్యోగాలు పొందాలనుకునే భారతీయ విద్యార్థులకు ఊరట కలిగించే అంశం.
