Indians In Canada: A major threat to Indians in Canada..!

కొత్త వీసా నిబంధనలు 1 మిలియన్ కంటే ఎక్కువ మంది చట్టపరమైన హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది. కెనడాలో లక్షలాది వర్క్ పర్మిట్లు గడువు దగ్గర పడుతున్నాయి. 2026 మధ్య నాటికి రెండు మిలియన్లకు పైగా ప్రజలు చట్టపరమైన హోదా లేకుండా దేశంలో నివసిస్తున్నారని ఇమ్మిగ్రేషన్ విశ్లేషకులు చెప్తున్నారు. వారిలో సగం మంది భారతదేశానికి చెందిన వారని ఆయన అంచనా వేస్తున్నారు. 2025 చివరి నాటికి దాదాపు 1.05 మిలియన్ల వర్క్ పర్మిట్లు గడువు ముగిసినట్లు ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్‌షిప్ కెనడా (IRCC) గణాంకాలు చూపిస్తున్నాయి. మరో 927,000 పర్మిట్లు 2026లో ముగియనున్నాయి. వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత, హోల్డర్లు కొత్త వీసా పొందకపోతే లేదా శాశ్వత నివాసం పొందకపోతే వారి చట్టపరమైన హోదాను కోల్పోతారని తెలుస్తోంది.


ఇటీవలి ప్రభుత్వ విధాన మార్పులు, తాత్కాలిక కార్మికులు, విదేశీ విద్యార్థులు తమ వీసాను పొడిగించుకోవడం లేదా శాశ్వత నివాసానికి వెళ్లడం కష్టతరం చేశాయి. 2026 మొదటి మూడు నెలల్లోనే దాదాపు 315,000 మంది తమ హోదాను కోల్పోతారని సమాచారం. 2025 చివరి త్రైమాసికంలో దాదాపు 291,000 అనుమతులు గడువు ముగిశాయి. రాబోయే రెండు సంవత్సరాలలో పత్రాలు లేని వలసదారుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని, కఠినమైన నిబంధనల వల్ల భారతీయులపై ప్రభావం పడనుందన్నారు.

Updated On
ehatv

ehatv

Next Story