కెనడాలో(Canada) జూన్‌ 18వ తేదీన ఖలిస్థానీ ఉగ్రవాది(Khalistan terrorist) హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ను(Hardeep Singh Nijjar) గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ హత్యలో భారత్‌ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధానమంత్రి జస్టిస్‌ ట్రూడో(Justice Trudeau) సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది భారతీయ ఏజెంట్లకు ఈ హత్యతో సంబంధమున్నట్లు తమ దగ్గర విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పారు. ఒట్టావాలోని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ట్రూడో మాట్లాడుతూ నిజ్జర్‌ హత్యోదంతంపై భద్రతా సంస్థలు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నాయని చెప్పారు.

కెనడాలో(Canada) జూన్‌ 18వ తేదీన ఖలిస్థానీ ఉగ్రవాది(Khalistan terrorist) హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ను(Hardeep Singh Nijjar) గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ హత్యలో భారత్‌ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధానమంత్రి జస్టిస్‌ ట్రూడో(Justice Trudeau) సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది భారతీయ ఏజెంట్లకు ఈ హత్యతో సంబంధమున్నట్లు తమ దగ్గర విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పారు. ఒట్టావాలోని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ట్రూడో మాట్లాడుతూ నిజ్జర్‌ హత్యోదంతంపై భద్రతా సంస్థలు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నాయని చెప్పారు. కెనడా పౌరుడి హత్యలో విదేశీ ప్రభుత్వ ప్రమేయం ఆమోదయోగ్యం కాని ఉల్లంఘన అంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం సహాకారం ఇవ్వాలని అన్నారు. ఇటీవల భారత్‌లో జరిగిన జీ20 సమావేశాలప్పుడే(G-20 Meet) ఈ విషయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) దృష్టికి తీసుకెళ్లినట్లు జస్టిస్‌ ట్రూడో అన్నారు. ట్రూడో ఆరోపణల నేపథ్యంలో కెనడా ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసింది. కెనడాలోని భారత దౌత్యకార్యాలయానికి చెందిన ఇంటెలిజెన్స్‌ విభాగం అధిపతి పవన్‌ కుమార్‌ రాయ్‌ను(Pawan kumar Roy) బహిష్కరించింది. పవన్‌కుమార్‌పై బహిష్కరణ వేటు వేసినట్టు కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జాలీ ప్రకటించారు కూడా! ఇది ఇలా ఉంటే జస్టిస్‌ ట్రూడో వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. కెనడాలో జరిగిన హత్యలో భారత్‌ ప్రమేయం ఉందంటూ కెనడా అసత్య ఆరోపణలు చేస్తున్నదని మండిపడింది. కెనడాలో ఆశ్రయం పొందుతూ, భారత సార్వభౌమత్వానికి ప్రమాదంగా మారిన ఖలిస్థానీ ఉగ్రవాదుల నుంచి దృష్టి మరల్చడానికే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపింది. ఇంతకు ముందు కూడా ప్రధాని మోదీ దగ్గర కెనడా ప్రధాని ఇలాంఇ ఆరోపణలే చేశారని పేర్కొంది. సుదీర్ఘంగా నెలకొన్న ఈ ఖలిస్థానీ వివాదంపై భారత్‌ చేసిన డిమాండ్లపై కెనడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ఆందోళన కలిగిస్తున్నదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. కెనడాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మానవ అక్రమ రవాణా, హత్యలు వంటివి జరగడం కొత్తేమీ కాదని, అలాంటి వాటిల్లోకి భారత ప్రభుత్వాన్ని లాగే ప్రయత్నాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. కెనడాలో నుంచి భారత వ్యతిరేక శక్తులను వెళ్లగొట్టేలా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని తాము మరోసారి కోరుతున్నామని భారత విదేశాంగ శాఖ తమ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

జీ 20 సమావేశాల వేదికగా భారత్‌-కెనడా దేశాల మధ్య ఏర్పడిన విభేదాలు ఇప్పుడు మరింత ముదిరాయి. ఆగస్టులో బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రేలో ఉన్న లక్ష్మీనారాయణ మందిరాన్ని ఖలిస్థానీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. జూన్‌ 18 హత్యపై కెనడా దర్యాప్తు చేస్తుంది అని పోస్టర్లు అంటించారు. తాజాగా కెనడా ప్రధానమంత్రి జస్టిస్‌ ట్రూడో కూడా ఇదే వాదన చేస్తున్నారు. ఈ హత్య వెనుక భారత్‌ హస్తం ఉందన్న అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. ట్రూడో ప్రకటన తర్వాత రెండు దేశాల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఓ పార్టీ మెప్పు కోసమే కెనడా ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అర్థమవుతోంది. తన రాజకీయ బలహీనత కారణంగానే ఆరంభం నుంచి ఖలిస్తానీ విషయంలో పక్షపాత వైఖరిని అవలబిస్తున్నారన్న ఆరోపణలు ట్రూడోపై ఉన్నాయి. 2021 తర్వాత నుంచి ట్రూడో ప్రభుత్వం రాజకీయంగా బలహీనపడుతూ వస్తోంది. ఇది ఖలిస్థానీ వేర్పాటువాదులకు ఆయుధంగా మారింది. రెండేళ్ల కింట జరిగిన ఎన్నికలలో హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ఉన్న మొత్తం 338 స్థానాలలో ట్రూడోకు చెందిన లిబరల్‌ పార్టీకి 150 స్థానాలు వచ్చాయి. అంతకు ముందు ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ట్రూడో పార్టీకి 27 సీట్లు తగ్గాయి.ఇక కన్జర్వేటివ్‌ పార్టీకి 121 స్థానాలు లభించగా, నేషనల్‌ డెమొక్రాటిక్‌ పార్టీకి 24 సీట్లు, బ్లాక్‌ క్యూబెక్స్‌కు 32 సీట్లు, గ్రీన్‌ పార్టీకి మూడు సీట్లు వచ్చాయి. ఒక స్థానంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి విజయం సాధించాడు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం ట్రూడోకు మరికొన్ని సీట్లు కావాల్సి వచ్చింది. దాంతో జగ్మీత్‌ సింగ్‌ ధాలివాల్‌ నేతృత్వంలోని నేషనల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ మద్దతు తీసుకున్నారు. నేషనల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ నాయకులు ఇప్పటికే చాలాసార్లు ఖలిస్థానీ వేర్పాటువాదులకు మద్దతు పలికారు.

ఖలిస్థానీ వేర్పాటువాదులకు, వారి ఎజెండాకు మద్దతు ప్రకటిస్తున్నందుకే జగ్మీత్‌కు 2013లో వీసాను తిరస్కరించింది భారత్‌! ఇప్పుడు ట్రూడో ప్రభుత్వాన్ని కాపాడుతున్నది జగ్మీత్‌ పార్టీనే!జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 తొలగింపును కూడా జగ్మీత్‌ వ్యతిరేకించిన విషయం తెలిసిందే! జీ7లో సభ్యదేశమైన కెనడాకు నాటోలో కూడా సభ్యత్వం ఉంది. ఇంత ప్రభావంతమైన దేశంలోని ప్రభుత్వం ఖలిస్థానీ మద్దతుదారులతో నడుస్తుండటమే భారత్‌కు తలనొప్పిగా మారింది. 2019 నుంచి జగ్మీత్‌ సింగ్‌ ధాలివాల్‌ చాలా యాక్టివ్‌ అయ్యాడు. ప్రపంచంలోని పలుదేశాలలో భారత దౌత్య కార్యాలయాలు, ఆలయాలపై ఖలిస్థానీల దాడులు పెరగడానికి జగ్మీత్‌ హ్యాండ్‌ కూడా ఉండే ఉంటుందన్నది భారత్‌ అనుమానం. కెనడా, అమెరికా, బ్రిటన్‌ , ఆస్ట్రేలియాలో ఈ మధ్య కాలంలో చాలా సంఘటనలు జరిగాయి. లండన్‌లోని భారత హైకమిషనర్‌ కార్యాలయంపై గత మార్చిలో ఖలీస్థానీ వేర్పాటువాదులు దాడికి దిగారు. భారత పతకాన్ని అవమానించారు. జూన్‌లో ఇందిరాగాంధీ హత్యను శ్లాఘిస్తూ కెనడాలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. టోరంటోలోని పంజాబీ పత్రిక సంజ్‌ సవేర అయితే ఇందిరాగాంధీ హత్యను కీర్తిస్తూ ఓ కవర్‌స్టోరీనే ప్రచురించింది. వీటన్నింటినీ భారత్‌ ఖండిస్తూ వస్తోంది. జులై ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగర శివారులో ఉన్న మేరీల్యాండ్‌లో ఖలిస్థానీ మద్దతుదారులు భారత విద్యార్థులపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. భారత దౌత్యవేత్తలకు, సిబ్బందిపై దాడులకు దిగుతామని ఖలిస్థానీలు హెచ్చరించారు.
హత్యకు గురైన హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ఖలిస్థానీ వేర్పాటువాది. ఇతడికి కెనడా పౌరసత్వం ఉంది. పంజాబ్‌లోని జలంధర్‌ సమీపంలోని భార్‌సింగ్‌ పుర గ్రామానికి చెందిన హర్దీప్‌ 1997లో కెనడాకు ప్లంబర్‌గా వలస వెళ్లాడు. అప్పటి నుంచి ఖలిస్థానీ వేర్పాటువాదులతో బలమైన సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ ఏర్పాటు వెనుక మాస్టర్‌ మైండ్‌ ఇతడిదే! (దీనిని భారత్‌ నిషేధించింది) సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌లో కూడా సభ్యుడైన హర్దీప్‌ను 2020లో భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. 2007లో లూథియానాలో జరిగిన బాంబుపేలుడు కేసులో హర్దీప్‌ నిజ్జర్‌ మోస్ట్‌ వాంటెడ్‌. ఈ దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 40 మందికిపైగా గాయపడ్డారు. 2009లో పాటియాలలో జరిగిన రాష్ట్రీయ సిక్‌ సంగత్‌ అధ్యక్షుడు రూల్టా సింగ్‌ హత్యలో కూడా హర్దీప్‌ ప్రమేయం ఉంది. ఇదంతా చూస్తుంటే ఇప్పట్లో ఇండియా, కెనడా సంబంధాలు మెరుగుపడేట్టుగా లేవు.

Updated On 19 Sep 2023 5:44 AM GMT
Ehatv

Ehatv

Next Story