Wildfires In Canada : కెనడాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న కార్చిచ్చు...ఇతర ప్రాంతాలకు తరలివెళుతున్న ప్రజలు
కెనడాను కార్చిచ్చు వదలడం లేదు. పైగా చాలా వేగంగా విస్తరిస్తూ సమస్తాన్ని స్వాహా చేస్తున్నది. కెనడా చరిత్రలోని కార్చిచ్చు(Wildfire) ఘటనల్లో ఇదే అత్యంత భయంకరమైనదని అంటున్నారు. అగ్ని కీలలు తరుముకుని వస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తట్టాబుట్టా సర్దుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.

Wildfires In Canada
కెనడాను కార్చిచ్చు వదలడం లేదు. పైగా చాలా వేగంగా విస్తరిస్తూ సమస్తాన్ని స్వాహా చేస్తున్నది. కెనడా చరిత్రలోని కార్చిచ్చు(Wildfire) ఘటనల్లో ఇదే అత్యంత భయంకరమైనదని అంటున్నారు. అగ్ని కీలలు తరుముకుని వస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తట్టాబుట్టా సర్దుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే వేలాది మంది ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. కెనడాలోని(Canada) నార్త్‌వెస్ట్ టెరిటరీస్‌లో(Northwest territories) రాజుకున్న దాదాపు 236 కార్చిచ్చులతో అగ్నిమాపక సిబ్బంది పోరాడుతున్నారు. వీరికి సాయంగా నార్త్ వెస్ట్ టెరిటరీస్‌లో కెనడా సైన్యం కూడా రంగంలోకి దిగింది. అత్యవసర సహాయక బృందాల కోసం రాయల్ కెనడియన్ వైమానిక దళానికి చెందిన విమానాలు, హెలికాప్టర్లను పెద్ద ఎత్తున మోహరించారు.ప్రజలు వెళ్లిపోవాలంటూ ఇప్పటికే అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలను తరలించడానికి ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. కాకపోతే ఇక్కడ క్యూ లైన్‌లలో గంటల కొద్దీ నిల్చోవాల్సి వస్తుండటంతో కొందరు సొంత కార్లలో వందల కొద్దీ కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారు. ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నా లెక్క చేయడం లేదు. ఎల్లోనైఫ్‌కు 300 కిలోమీటర్ల దూరంలోని బిగ్‌రివర్ సర్వీస్ స్టేషన్ వద్ద ఆయిల్ కోసం భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
