ఎయిర్ ఇండియా విమానంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న అంద‌రినీ షాక్‌కి గురి చేసింది.

ఎయిర్ ఇండియా విమానంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న అంద‌రినీ షాక్‌కి గురి చేసింది. బెంగళూరు నుంచి వారణాసి కి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (ఫ్లైట్ IX-1086)లో సెక్యూరిటీ భయం నెలకొంది. ఒక పాసింజర్ కాక్‌పిట్ డోర్ తెరవడానికి ప్రయత్నించాడు.అదే సమయంలో ఆ పాసింజర్ సరైన పాస్‌కోడ్ కూడా ఎంటర్ చేశాడు. అయినప్పటికీ, పైలెట్ భద్రత కారణంగా డోర్ తెరవడానికి అంగీక‌రించ‌లేదు. హైజాక్ జ‌రిగే అవకాశ‌ముంద‌న్న అనుమానంతో పైల‌ట్ అల‌ర్ట్ అయ్యాడు. ఆ పాసింజర్ మ‌రో 8 మంది స‌హ‌చ‌రుల‌తో ప్ర‌యాణిస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా విమానం ల్యాండ్ అయిన వెంట‌నే ఆ 9 మంది ప్ర‌యాణికుల‌కు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)కి అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం అధికారులు వారిని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఈ ఘటనపై అధికారిక ప్రకటన ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మనార్హం.

ehatv

ehatv

Next Story