మనిషి చేసిన మహాద్భుతమైన పనులలో కాల విభజన ఒకటి

మనిషి చేసిన మహాద్భుతమైన పనులలో కాల విభజన ఒకటి. వేల సంవత్సరాల కిందటే మనిషి కాలాన్ని తిథులు, వారాలు, నెలలు, సంవత్సరాలుగా విభజించుకున్నాడు. గడియకు ఎన్ని లిప్తాలో చెప్పాడు. తర్వాత గంటకు 60 సెకన్లు, రోజుకు 24 గంటలుగా విభజించాడు. ఇప్పుడు మనకు రోజుకు 24 గంటలే కానీ కొన్ని కోట్ల సంవత్సరాల కిందట రోజుకు 26 గంటలు ఉండేవట! అప్పుడు లెక్కేశారా? ఏమిటి? అని డౌటానుమానం వ్యక్తం చేయకండి.. అంటే ఇప్పటి టైమ్‌ను బట్టి చూస్తే అప్పుడు 26 గంటలు ఉండేవని అర్థం.

చైనాలోని(China) చెంగ్డూ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీకి(Chengdu University of Technology) చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. చంద్రుడి గురుత్వాకర్షణ భూభ్రమణంపై ప్రభావం చూపుతుందని, ఈ శక్తి తగ్గడం వల్ల భూభ్రమణ వేగం రెండు గంటల మేర పెరిగిందని అధ్యయనం చెబుతోంది. 500 మిలియన్‌ ఏళ్ల నుంచి 650 మిలియన్‌ ఏళ్ల మధ్య సంభవించిన కేంబ్రియన్‌ పేలుడు, 280 మిలియన్‌ సంవత్సరాల నుంచి 340 మిలియన్‌ సంవత్సరాల మధ్య జరిగిన మరో పేలుడు వల్లనే రోజు నిడివి పెరిగిందంటున్నారు. రోజు నిడివి, భూభ్రమణంపై హిమనీనదాల కంటే అలల ప్రభావమే ఎక్కువ ఉంటున్నదని పరిశోధకులు అంటున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story