వైద్య వృత్తికే కళంకం తెచ్చాడా డాక్టర్‌(Doctor).. వృద్ధురాలి పట్ల జాలి, దయ చూపకుండా దారుణంగా ప్రవర్తించాడు. కంటి చికిత్సకు వెళ్లిన ఆ వృద్ధురాలికి చికిత్స చేస్తూ ఆమెను కొట్టాడు. ఈ సంఘటన చైనాలోని(China) గైగాంగ్‌లో(Gaigong) చోటు చేసుకుంది. కాకపోతే ఈ ఘటన జరిగింది 2019లో! ఇందుకు సంబంధించిన వీడియో(Video) మాత్రం ఇప్పుడు వైరల్‌ అవుతోంది. వుహాన్‌లోని ఓ కంటి ఆసుపత్రికి(Eye Hospital) చికిత్స కోసం 82 ఏళ్ల వృద్ధురాలు వెళ్లింది.

వైద్య వృత్తికే కళంకం తెచ్చాడా డాక్టర్‌(Doctor).. వృద్ధురాలి పట్ల జాలి, దయ చూపకుండా దారుణంగా ప్రవర్తించాడు. కంటి చికిత్సకు వెళ్లిన ఆ వృద్ధురాలికి చికిత్స చేస్తూ ఆమెను కొట్టాడు. ఈ సంఘటన చైనాలోని(China) గైగాంగ్‌లో(Gaigong) చోటు చేసుకుంది. కాకపోతే ఈ ఘటన జరిగింది 2019లో! ఇందుకు సంబంధించిన వీడియో(Video) మాత్రం ఇప్పుడు వైరల్‌ అవుతోంది. వుహాన్‌లోని ఓ కంటి ఆసుపత్రికి(Eye Hospital) చికిత్స కోసం 82 ఏళ్ల వృద్ధురాలు వెళ్లింది. ఆమెకు చికిత్స ఇవ్వడానికి ముందు అనస్థేషియా(Anesthesia) ఇచ్చారు. కానీ ఆమెపై అది అంతగా ప్రభావం చూపలేదు. సర్జరీ కొనసాగుతున్నప్పుడు ఆమె తల, కనుగుడ్లు కదిలించింది. దాంతో డాక్టర్‌కు కోపంవచ్చింది. ఆమె తలపై బలంగా కొట్టాడు. ట్రీట్‌మెంట్‌కు సహకరించాలని గట్టిగా అరిచాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో హాస్పిటల్‌ యాజమాన్యం రియాక్టయ్యింది. ఆ వృద్ధురాలికి క్షమాపణలు చెప్పింది. పరిహారం కింద ఆరు వేల రూపాయలు చెల్లించింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పింది. వృద్ధురాలిని కొట్టిన ఆ డాక్టర్‌ను సస్పెండ్‌ చేశారు.

Updated On 27 Dec 2023 4:59 AM GMT
Ehatv

Ehatv

Next Story