విలాసాలకు అలవాటు పడ్డ ఓ మహిళ ఒకరికి తెలియకుండా మరొకరితో మూడు పెళ్లిళ్లు(Marriages) చేసుకుంది. ఉద్యోగరీత్యా భార్యను పట్టించుకోని భర్త.. రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో భర్తకు తెలియకుండా ముగ్గురిని పెళ్లాడింది. ఒకరికి తెలియకుండా మరొకరిని నమ్మించి పెళ్లి చేసుకుంది. ఆ ముగ్గురిలో ఒకరికి మహిళ వ్యవహారంపై అనుమానంతో ఆరా తీయగా ఆ మహిళ నిర్వాకం బయటపడింది. ముగ్గురు భర్తల నుంచి రూ.80 లక్షల వరకు కాజేసింది. దీంతో పోలీసులు(Police) ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఈస్ట్ చైనాలోని(East China) జియాంగ్సు(Jiangsu) ప్రావిన్స్‌కు చెందిన జౌ(Zhou) అనే మహిళకు స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహమైంది. వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది. ఉంది. అయితే జౌ భర్త పని కోసం నెలనెల తరబడి ఆమెకు దూరంగా ఉండేవాడు. మరోవైపు జౌకు డబ్బు అవసరమైంది.

తొలుత ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న జౌ.. తనకు పెళ్లైందని, కానీ మనస్పర్థల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్నట్లు చెప్పింది. అలాగే విడాకులకు కూడా దరఖాస్తు చేసినట్లు చెప్పి ఆ వ్యక్తిని వివాహం చేసుకుంది. పలు కారణాలు చెప్పి డబ్బు లాగింది. ఆ డబ్బుతో జల్సాలు చేసేది. రోజురోజుకు ఆమె జల్సాలు పెరిగిపోయాయి. దాంతో ఇంకా ఎక్కువ డబ్బు కావాల్సి వచ్చింది. దీంతో ఆ మహిళ ఈజీగా డబ్బు సంపాదించాలని భావించి మరో ఇద్దరిని పెళ్లాడింది. అలా ఒకే సమయంలో ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకొని ఆ ముగ్గురితో సంబంధాలను కొనసాగించింది. ఆ ముగ్గురి నుంచి సుమారు రూ.80లక్షలు వసూలు చేసింది. అయితే, ఆ ముగ్గురిలో ఓ వ్యక్తి నుంచి మాత్రం గట్టిగా డబ్బు లాగింది. అంతటితో ఆగకుండా ఇంకా డబ్బు కావాలని ఆ వ్యక్తిని అడిగింది. ప్రస్తుతం గర్భవతినని, తల్లి వద్ద ఉంటున్నట్లు అతనితో అబద్ధం చెప్పింది.

కొన్ని రోజుల తర్వాత తనకు కవలు పుట్టారని చెప్పి, డబ్బు కావాలని కోరింది. దీంతో జౌ వ్యవహారంపై అతనికి అనుమానం వచ్చింది. ఆ తర్వాత తన ప్రవర్తనను గమనించసాగాడు. కొన్ని రోజుల తర్వాత అతనికి ఆ అనుమానం మరింతి బలపడింది. ఈ క్రమంలో జౌ చెప్పిన అడ్రస్‌కు వెళ్లి ఆరా తీశాడు. అక్కడికి వెళ్లిన తర్వాత జౌ చెప్పిందంతా పచ్చి అబద్ధం అని నిర్ధారణకు వచ్చాడు. వెంటనే స్థానిక పోలీసులకు ఆమెపై ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు రంగంలోకి విచారించిన పోలీసులు జౌను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో ఆమె విస్తుపోయే నిజాలు చెప్పింది. జో ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. జో మోసాలు చూసి పోలీసులకు షాక్ అయ్యారు. భర్తకు తెలియకుండా మరో ముగ్గురిని పెళ్లాడి దాదాపు రూ.80 లక్షలు వారి వద్ద నుంచి లాగి జల్సాలు చేసినట్లు విచారణలో తేలడంతో పోలీసులు విస్తుపోయారు.

Updated On 9 Nov 2023 6:17 AM GMT
Ehatv

Ehatv

Next Story