చైనాలో(China) జనాభా(Population) తగ్గుదల నేపథ్యంలో పలు కంపెనీలు డేటింగ్ కాంటాస్ట్‌లను(Dating concepts) నిర్వహిస్తున్నాయి.

చైనాలో(China) జనాభా(Population) తగ్గుదల నేపథ్యంలో పలు కంపెనీలు డేటింగ్ కాంటాస్ట్‌లను(Dating concepts) నిర్వహిస్తున్నాయి. సింగిల్స్ మూడు నెలల పాటు డేటింగ్‌లో ఉంటే వారికి 1000 యువాన్లు అనగా మన భారత కరెన్సీలో రూ.11,650 బహుమతిగా ఇస్తామని ఓ కంపెనీ తమ ఉద్యోగులకు ఆఫర్‌ ఇచ్చింది. తీవ్ర జనాభా సంక్షోభాన్ని చైనా ఎదుర్కొంటోంది. పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. జనాభా సంక్షోభం నుంచి బయటపడేందుకు ఓ కంపెనీ డేటింగ్‌కి వెళ్తే నగదు బహుమతి ఇస్తామని సరికొత్త ప్రకటన చేసింది. కంపెనీలో వర్క్ చేస్తున్న సింగిల్స్(Singles) అందరూ కూడా డేటింగ్ చేసేలా డిఫరెంట్ ఆఫర్లను ప్రకటిస్తోంది. ఎవరైతే సింగిల్‌గా ఉన్నారో వారు డేటింగ్‌కి వెళ్తే.. డబ్బును బహుమతిగా ఇస్తామని ఓ టెక్ కంపెనీ ప్రకటించింది.

ఈ డేటింగ్ కాంటాస్ట్‌లో కంపెనీలో వర్క్ చేసే సింగిల్స్ అందరూ ఇతరులు ఆకర్షితులు అయ్యే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టాలి. అయితే అలా పోస్ట్‌లు చేయడం వల్ల వారికి 66 యువాన్లు భారత కరెన్సీలో రూ.770 ఇస్తారు. పోస్ట్ చేసిన తర్వాత మూడు నెలల పాటు ఆ వ్యక్తితో డేటింగ్ చేస్తే ఒక్కోరికి 1000 యువాన్లు ఇస్తామని కంపెనీ తెలిపింది. ఒకప్పుడు అత్యధిక జనాభా ఉన్న చైనా నేడు మానవ వనరుల కొరతను ఎదుర్కొంటోంది. యువత పెళ్లికి అయిష్టంగా ఉండడంతో ఈ సమస్య వచ్చి పడుతుంది. ఈ ఆఫర్లకు ఆకర్షితులై డేటింగ్‌ పెళ్లిపై ఓ నిర్ణయానికి వస్తారని కంపెనీలు ఈ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story