పొరుగు దేశం పాకిస్తాన్‌లో ఎప్పుడూ ఏదో ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి.

పొరుగు దేశం పాకిస్తాన్‌లో ఎప్పుడూ ఏదో ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. తెగల మధ్య పోరాటం అన్నది అక్కడ ఆనవాయితీగా మారింది. ఖైబర్‌ ప్రావిన్స్‌లో అయితే స్మశాన నిశ్శబ్దం నెలకొంది.ఇక్కడ రెండు తెగల జరుగుతున్న ఘర్షణలో 130 మందికి పైగానే చనిపోయారు. కుర్రం జిల్లాలోని అలిజాయ్, బగాన్‌ తెగల మధ్య నవంబర్‌ 22వ తేదీన ఘర్షణలు మొదలయ్యాయి. అంతకుముందు రోజు, జిల్లాలోని పరాచినార్‌(parachinar) సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్లపై దాడులు జరిగింది. ఇందులో 57 మంది చనిపోయారు. అప్పట్నుంచే ఘర్షణలు మొదలయ్యాయి. సున్నీ(Sunni), షియా(Shia),గ్రూపుల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఆ ప్రాంతంలో హింసాత్మక ఘటనలు, ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆదివారం జరిగిన ఘర్షణల్లో మరో ఆరుగురు చనిపోగా, 8 మంది గాయపడ్డారు. దీంతో మరణాల సంఖ్య 130కి, క్షతగాత్రుల సంఖ్య 186కు చేరిందన్నారు. ప్రభుత్వం విద్యా సంస్థలను మూసివేసింది. మొబైల్, ఇంటర్నెట్‌ సర్వీసులను ఆపేసింది. పెషావర్‌–పరాచినార్‌ రహదారిని, పాక్‌–అఫ్గాన్‌ సరిహద్దుల్లోని ఖర్లాచి పాయింట్‌ వద్ద రాకపోకలను నిలిపివేసింది. చమురు, నిత్యావసరాలు, మందులు దొరక్క సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story