అన్ని పూలు పరిమళాలను వెదజల్లవు. వాసన లేని పూలు కూడా ఉంటాయి. తావి లేని ఆ విరులకు విలువ ఉండదు. వాసన లేకపోతే పోనియ్‌.. కంపు కొట్టవు కదా అని అనుకోడానికి లేదు.. ఎందుకంటే కొన్ని పూలు భయంకరమైన దుర్గంధాన్ని వెదజల్లుతాయి.. అట్లాంటిదే కార్ప్స్‌ ఫ్లవర్‌.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద పుష్పం ఇదే.. అలాగే ప్రపంచంలోనే అత్యంత దుర్వాసన వెదజల్లే పువ్వు కూడా ఇదే! ఇది పదేళ్లకోసారి మాత్రమే పూస్తుంది. దాన్ని చూడాలని ముచ్చటపడ్డారో అంతేసంగతులు..

అన్ని పూలు పరిమళాలను వెదజల్లవు. వాసన లేని పూలు కూడా ఉంటాయి. తావి లేని ఆ విరులకు విలువ ఉండదు. వాసన లేకపోతే పోనియ్‌.. కంపు కొట్టవు కదా అని అనుకోడానికి లేదు.. ఎందుకంటే కొన్ని పూలు భయంకరమైన దుర్గంధాన్ని వెదజల్లుతాయి.. అట్లాంటిదే కార్ప్స్‌ ఫ్లవర్‌(corpse flower).. ప్రపంచంలోనే అత్యంత పెద్ద పుష్పం ఇదే.. అలాగే ప్రపంచంలోనే అత్యంత దుర్వాసన వెదజల్లే పువ్వు కూడా ఇదే! ఇది పదేళ్లకోసారి మాత్రమే పూస్తుంది. దాన్ని చూడాలని ముచ్చటపడ్డారో అంతేసంగతులు.. ఆ పుష్పం వికసించగానే దాని నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు దుర్వాసన వ్యాపిస్తుంది. చస్తే దాని దగ్గరకు వెళ్లలేం! వెళితే ఆ దుర్గంధానికే చస్తామేమో! ఈ పువ్వును టైటాన్ వాన్‌కాగ్‌ అని కూడా అంటారు. అమెరికాలోని వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీలో ప్రస్తుతం ఇది వికసించింది. ఈ పువ్వు పూర్తిగా విచ్చుకోవడానికి 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతుంది. దీని నుంచి కుళ్లిన మాంసం వాసన వస్తుంది. అందుకే శవ పుష్పమని, మృత్యు పుష్పమని కూడా అంటారు. కరోనా టైమ్‌లో అమెరికాలోని ఫ్రాన్సిస్కోలో ఈ పువ్వు కనిపించింది. మళ్లీ ఇన్నేళ్లకు దర్శనమిచ్చింది. కొంత దూర వరకు దీని దుర్వాసన వ్యాపిస్తుండంతో స్థానికులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. 2011లో కూడా ఈ పువ్వు పూసింది. చూసేందుకు చాలా వింతగా ఉంటుంది. 12 అడుగుల ఎత్తు కలిగి ఉండే ఈ పువ్వు చాలా అరుదు. పదేళ్లకోసారి పూస్తుంది.. పూసినప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. అందంగా ఉంది కదా అని దగ్గర్నుంచి చూడ్డానికి వెళితే మాత్రం ముక్కు అదిరిపోతుంది..

Updated On 4 July 2023 6:06 AM GMT
Ehatv

Ehatv

Next Story