క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo)కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్నారు.

క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo)కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఫుట్‌బాల్‌ ఆటపై అంతంత మాత్రం ఇంట్రెస్ట్‌ ఉన్నవారు కూఆ రోనాల్డోను ఇష్టపడతారు. పోర్చుగల్‌కు చెందిన స్టార్‌ ఫుట్‌బాల్ ప్లేయర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో సరికొత్త రికార్డు సాధించాడు. ఆయన సోషల్‌ మీడియా ఖాతాలన్నింటిలో కలిపి ఫాలోవర్ల (Social Media Followers) సంఖ్య ఏకంగా 100 కోట్లను దాటింది. సామాజిక మాధ్యమాల్లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వ్యక్తి రోనాల్డోనే కావడం విశేషం. తనకు ఇంతటి ఖ్యాతిని తెచ్చిపెట్టిన అభిమానులకు రొనాల్డో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు ఓ పోస్ట్‌ చేశాడు. అందులో ఆయన ఏమన్నారంటే 'మనం చరిత్ర సృష్టించాం. 100 కోట్ల ఫాలోవర్లు! ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదు. అంతకుమించిన మీ ప్రేమాభిమానాలకు నిదర్శనం. మడైరా వీధుల నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద వేదికల వరకు నేను ఎల్లప్పుడూ నా కుటుంబంతో పాటు మీ కోసమే ఆడాను. ఇప్పుడు వంద కోట్ల మంది నాకోసం నిలబడ్డారు. నా ఉత్థాన పతనాలలో , ప్రతీ అడుగులోనూ మీరున్నారు. ఇది మన ప్రయాణం. మనమంతా కలిస్తే ఏదైనా సాధించగలమని నిరూపించాం. నాపై విశ్వాసం ఉంచి, నాకు ఎల్లవేళలా అండగా ఉన్నందుకు, నా జీవితంలో భాగమైనందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. నేనింకా ఉత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంది. మరిన్ని విజయాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాల్సి ఉంది' అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. ఈ మధ్యనే రొనాల్డో యూట్యూబ్‌ ఛానెల్‌లోకి వచ్చారు. వస్తూ వస్తూనే సంచలనం సృష్టించారు. యూట్యూబ్‌లోకి అలా వచ్చారో లేదో సబ్‌స్క్రైబర్ల సంఖ్య కోటి దాటేసింది. ప్రస్తుతం అతడి యూట్యూబ్‌ అకౌంట్‌కు ఆరు కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డోను 63.9కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఎక్స్‌లో 11.3 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 17 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు

Updated On
Eha Tv

Eha Tv

Next Story