లో(America)ని టెక్సాస్‌(Texas)లో ఏప్రిల్‌ పదిన జరిగిన ఓ భారీ ప్రమాదంలో నోరులేని మూగజీవాలు చనిపోయాయి. డిమ్మిట్‌(Dimmitt)లోని సౌత్‌ఫోర్క్‌ డెయిరీఫాం(South Fork Dairy Farm)లో పేలుడు జరగడంతో 18 వేలకుపైగా ఆవులు మరణించాయి. అందులో పని చేస్తున్న ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన ఆవుల విలువ 36 మిలియన్‌ డాలర్లకు పైగా ఉంటుందంటున్నారు. 2013 తర్వాత డెయిరీ ఫాంలలో ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకోవడం ఇదే మొదలు

అమెరికాలో(America)ని టెక్సాస్‌()లో ఏప్రిల్‌ పదిన జరిగిన ఓ భారీ ప్రమాదంలో నోరులేని మూగజీవాలు చనిపోయాయి. డిమ్మిట్‌(Dimmitt)లోని సౌత్‌ఫోర్క్‌ డెయిరీఫాం(South Fork Dairy Farm)లో పేలుడు జరగడంతో 18 వేలకుపైగా ఆవులు మరణించాయి. అందులో పని చేస్తున్న ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన ఆవుల విలువ 36 మిలియన్‌ డాలర్లకు పైగా ఉంటుందంటున్నారు. 2013 తర్వాత డెయిరీ ఫాంలలో ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకోవడం ఇదే మొదలు. డెయిరీ ఫాంలోని యంత్రాలు వేడెక్కడంతో ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పేలుడు జరిగిన తర్వాత ఒక్కసారిగా మీథేన్‌ అధిక మొత్తంలో విడుదలయ్యింది. అందుకే ఆవులు చనిపోయి ఉంటాయని చెబుతున్నారు. ప్రమాదం ఎలా జరిగి ఉంటుందన్నదానిపై దర్యాప్తు జరుగుతోంది. డెయిరీ ఫాంలలో మీథేన్‌ వాయువు వెలువడటం సర్వసాధారణం. పేడ నిల్వ ఉన్న చోట మీథేన్‌ వాయువు బయటకు వస్తుంది. అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాలలో డెయిరీ ఫాంలు భారీగా ఉంటాయి. ఒక్కో ఫాంలో 15 వేల కంటే ఎక్కువ ఆవులు ఉంటాయి. వీటిని బార్‌గా వ్యవహరిస్తారు. డెయిరీ ఫాంలలోని పనులన్నీ యంత్రాల సాయంతోనే జరుగుతాయి. ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్‌ చేయడం కోసం కొద్ది మంది పనివారు ఉంటారంతే. హఠాత్తుగా పేలుడు సంభవించడంతో మంటలను అదుపు చేయడం సాధ్యం కాలేదు. ఆ కారణంగానే వేలకొద్దీ ఆవులు చనిపోయాయి. పాలు భద్రపరిచే గదిలో మహిళల చిక్కుకుపోవడంతో గాయాలతో ఆమె బయటపడగలిగింది.

Updated On 14 April 2023 1:06 AM GMT
Ehatv

Ehatv

Next Story