విమాన ప్రయాణికులకు శుభవార్త.! విమాన టికెట్ల రద్దు విషయంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని డీజీసీఏ తాజాగా ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది.

విమాన ప్రయాణికులకు శుభవార్త.! విమాన టికెట్ల రద్దు విషయంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని డీజీసీఏ తాజాగా ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రయాణికులు బుక్ చేసుకున్న 48 గంటల్లోపు తమ టికెట్లను రద్దు చేసుకోవచ్చు లేదంటే తమ ప్లాను సవరించుకోవచ్చు. ఇందుకు ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికోసం టికెట్ బుక్ చేసుకున్న 48 గంటలపాటు విమానయాన సంస్థలు 'లుక్ ఇన్ ఆప్షన్'ను అందించాల్సి ఉంటుంది. ఐదు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ముందుగా బుక్ చేసుకున్న దేశీయ విమానాలు, 15 లేదా అంతకంటే ఎక్కువ రోజులు ముందుగా బుక్ చేసుకున్న అంతర్జాతీయ విమానాలకు ఈ నిబంధన వర్తిస్తుంది' అని డీజీసీఏ ముసాయిదా మార్గదర్శకాల్లో తెలిపింది. వీటికి ఆమోదం లభిస్తే అత్యవసర పరిస్థితుల్లో తమ ప్లాన్ను మార్చుకోవాలనుకునే లేదా టికెట్లను రద్దు చేసుకోవాలనుకునే ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది. రద్దు చేసుకున్న టికెట్ల డబ్బుని విమానయాన సంస్థలు నిర్ణీత గడువులోగా చెల్లించాలని డీజీసీఏ సూచించింది.

Updated On
ehatv

ehatv

Next Story