✕
Dollor vs Rupee: డాలర్ @ రూ.90.83..! రికార్డ్ స్థాయిలో పతనమైన రూపాయి విలువ.
By ehatvPublished on 16 Dec 2025 9:32 AM GMT
Dollar vs Rupee: The dollar is at ₹90.83! The rupee's value has fallen to a record low.

x
అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ అంతకంతకూ పడిపోతుంది. మంగళవారం రూపాయి విలువ మరింత పతనమై ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే మారకపు విలువ 5 పైసలు క్షీణించింది. 90.83కు చేరింది. భారత్-అమెరికా డీల్‌పై అనిశ్చితులు, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాల వల్లే రూపాయి మారకం విలువ క్షీణిస్తోందని నిపుణులు అంటున్నారు. భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యం వల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింటోందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ ఒడుదొడుకులు, డాలర్‌కు డిమాండ్ పెరగడం వంటివి కారణాలుగా పేర్కొంటున్నారు. ఈ క్షీణత మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని, త్వరలో 91 మార్క్ కూడా దాటొచ్చని అంచనా వేస్తున్నారు.

ehatv
Next Story

