ఇదో నీచ నికృష్ట భర్త కథ.. అభాగ్యురాలైన భార్య ఆవేదనభరితగాధ! భార్య పట్ల ఓ వ్యక్తి అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. అమెపై చాలా మందితో అత్యాచారాలు(rapes) చేయించాడు. ఈ ఘోరమైన ఘటన ఫ్రాన్స్‌లో(France) జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన డొమినిక్‌(Dominic) అనే వాడు ప్రతి రోజు రాత్రి తన భార్యకు యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్‌(Anti-anxiety drugs) ఇచ్చేవాడు.

ఇదో నీచ నికృష్ట భర్త కథ.. అభాగ్యురాలైన భార్య ఆవేదనభరితగాధ! భార్య పట్ల ఓ వ్యక్తి అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. అమెపై చాలా మందితో అత్యాచారాలు(rapes) చేయించాడు. ఈ ఘోరమైన ఘటన ఫ్రాన్స్‌లో(France) జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన డొమినిక్‌(Dominic) అనే వాడు ప్రతి రోజు రాత్రి తన భార్యకు యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్‌(Anti-anxiety drugs) ఇచ్చేవాడు. ఆమెకు తెలియకుండా ఆహారంలో కలిపి తినిపించేవాడు. కాసేపటికి ఆమె మత్తులో జారుకునేది. ఆ సమయంలో కొందరు వ్యక్తులను ఇంటికి పిలిపించేవాడు.

వారితో ఆమెపై లైంగిక దాడి చేయించేవాడు. ఆ దృశ్యాలను కెమెరాల్లో రికార్డు(Video Recording) చేసేవాడు. ఇలా ఈ దారుణాలను పదేళ్ల పాటు చేశాడు. ఈ పదేళ్ల కాలంలో ఆమెపై 92 సార్లు అత్యాచారం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ దారుణాలకు ఒడిగట్టిన వారి వయసు 26 ఏల్ల నుంచి 73 ఏళ్ల మధ్యలో ఉంటుందని పోలీసులు చెప్పారు. వీరిలో 51 మందిని గుర్తించామని, మిగతా వారి కోసం అన్వేషిస్తున్నామని తెలిపారు. ఆమెపై అత్యాచారం చేసిన వారిలో లారీ డ్రైవర్లు(Driver), మున్సిపల్‌ కౌన్సిలర్లు(Municipal Councillors), జైలు సిబ్బంది వంటి వారు కూడా ఉన్నారు. వీరంతా పలుమార్లు డొమినిక్‌ ఇంటికి వెళ్లారట.

ఆన్‌లైన్‌లోని ఓ గ్రూప్‌ ద్వారా వీరిని డొమినిక్‌ ఇంటికి రప్పించేవాడట! ఇంటికి వచ్చే వారు పొగాకు, పర్‌ఫ్యూమ్స్‌ వంటివి వాడకూడదని ముందే చెప్పేవాడట. ఎందుకంటే వాటి వాసనలకు తన భార్య ఎక్కడ మెలుకవలోకి వస్తుందోనన్న భయం. ఇక ఇరుగుపొరుగు వారికి అనుమానం రాకుండా ఉండేదుకు తన ఇంటికి వచ్చేవారి వాహనాలను ఎక్కడో దూరంగా పార్క్‌ చేయించేవాడట. పాపం ఆమె తనపై జరుగుతున్న దారుణాలను పదేళ్ల పాటు తెలుసుకోలేకపోయింది. విషయం తెలిసిన వెంటనే ఆమె గట్టిగా రోదించింది. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. విడాకుల కోసం అప్లై చేసింది. ప్రస్తుతం ఆమె శారీరకంగానూ, మానసికంగానూ చాలా కుంగిపోయింది. డొమినిక్‌ మాత్రం తనకు భార్య అంటే ఎంతో ప్రేమని చెబుతున్నాడు. తన ఫస్ట్‌ లవ్‌ ఆమెనని అంటున్నాడు.. ఇంతకీ వీడు మొగుడేనా

Updated On 22 Jun 2023 7:00 AM GMT
Ehatv

Ehatv

Next Story