సెప్టెంబర్ 4న కమలా హారిస్‌పై(Kamala Haaris) చర్చకు ఫాక్స్ న్యూస్(Fox news) ఆఫర్‌కు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అంగీకరించారు.

సెప్టెంబర్ 4న కమలా హారిస్‌పై(Kamala Haaris) చర్చకు ఫాక్స్ న్యూస్(Fox news) ఆఫర్‌కు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అంగీకరించారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ తో చర్చకు ఫాక్స్ న్యూస్ చేసిన ప్రతిపాదనకు తాను అంగీకరించినట్లు మాజీ అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం రాత్రి ప్రకటించారు. ఈవెంట్ ఎక్కడ జరుగుతుందో ఇంకా నిర్ణయించనప్పటికీ, సెప్టెంబర్ 4న పెన్సిల్వేనియాలో చర్చ జరుగుతుందని ట్రంప్ తెలిపారు.

"సెప్టెంబర్ 4వ తేదీ బుధవారం కమలా హారిస్‌పై చర్చకు ఫాక్స్‌న్యూస్‌తో నేను అంగీకరించాను" అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో రాశారు. బిడెన్ ఎన్నికల పోటీ నుండి తప్పుకోవడంతో ట్రంప్, కమలా హారిస్ మధ్య టఫ్ ఫైట్ జరుగుతూ ఉంది. అందుకే ఇప్పుడు ట్రంప్.. కమలాతో డిబేట్ లో పాల్గొనబోతున్నారు. డిబేట్ మోడరేటర్‌లుగా ఫాక్స్ న్యూస్ యాంకర్లు బ్రెట్ బేయర్, మార్తా మెక్కల్లమ్ ఉంటారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story