Dr Saveera Parkash : పాక్ ఎన్నికల్లో హిందూ మహిళ... నీరాజనాలు పలుకుతున్న ముస్లింలు
పాకిస్తాన్‌లో(Pakistan) పొలిటికల్ హీట్ పెరిగింది. సాధారణ ఎన్నిలకు మరో మూడు రోజుల సమయం మాత్రమే మిగిలింది. అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు. పార్టీలు వ్యూహరచనలో నిమగ్నమయ్యాయి. ఈ ఎన్నికల్లో ఓ విశేషం ఉంది. పాకిస్తాన్ ఎన్నికల్లో ఓ హిందూ మహిళ పోటీ చస్తున్నారు. ఆమె పేరు సవీరా ప్రకాశ్(Saveera Prakash). పాక్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళ(Hindu woman) ఈమెనే! హిందువే అయినప్పటికీ ముస్లిం ప్రాబల్యం ఉనన ప్రాంతాలలో సవీరా ప్రచారం చేస్తున్నారు.

Dr Saveera Parkash
పాకిస్తాన్‌లో(Pakistan) పొలిటికల్ హీట్ పెరిగింది. సాధారణ ఎన్నిలకు మరో మూడు రోజుల సమయం మాత్రమే మిగిలింది. అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు. పార్టీలు వ్యూహరచనలో నిమగ్నమయ్యాయి. ఈ ఎన్నికల్లో ఓ విశేషం ఉంది. పాకిస్తాన్ ఎన్నికల్లో ఓ హిందూ మహిళ పోటీ చస్తున్నారు. ఆమె పేరు సవీరా ప్రకాశ్(Saveera Prakash). పాక్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళ(Hindu woman) ఈమెనే! హిందువే అయినప్పటికీ ముస్లిం ప్రాబల్యం ఉనన ప్రాంతాలలో సవీరా ప్రచారం చేస్తున్నారు. ఆమె ప్రచారానికి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఖైబర్ ఫక్తూన్‌ఖ్వాలోని బునెర్ అసెంబ్లీ(Buner Assembly) నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(Pakisthan Peoples Party) తరపున ఆమె బరిలో దిగుతున్నారు. వృత్తిరీత్యా వైద్యురాలు అయిన సవీరా తండ్రి పేరు ఓం ప్రకాశ్(Om Prakash). ఆయన కూడా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలో సభ్యుడు. ఆయన కూడా వైద్య వృత్తిలో రాణిస్తున్నారు.
తాను భారత్-పాక్ మధ్య సత్సంబంధాలకు వారధిగా పని చేయాలని కోరుకుంటున్నట్లు సవీరా ప్రకాష్ తెలిపారు. తాను డాక్టర్‌నని, పాకిస్తాన్‌లోని ఆసుపత్రుల్లో పరిస్థితులను మెరుగుపరిచేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. సవీరా 2022లో మెడికల్ కాలేజీ నుండి పట్టా పుచ్చుకున్నారు. బునర్ అసెంబ్లీలో పీపీపీ పార్టీ మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సవీరా ప్రకాశ్ చాలా కాలంగా తండ్రితోపాటు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. పాకిస్తాన్‌లో మహిళల అభ్యున్నతి, ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారు.
