టెస్లా సీఈవో(Tesla), ఎక్స్‌(Twitter) అధినేత ఎలాన్‌ మస్క్‌ది(Elon musk) క్రియేటివ్‌ బ్రెయిన్‌! అందుకే అంత గొప్ప ధనవంతుడయ్యాడనుకోండి! లేటెస్ట్‌గా ఎలాన్‌ మస్క్‌కు ఓ ఆలోచన వచ్చింది.

టెస్లా సీఈవో(Tesla), ఎక్స్‌(Twitter) అధినేత ఎలాన్‌ మస్క్‌ది(Elon musk) క్రియేటివ్‌ బ్రెయిన్‌! అందుకే అంత గొప్ప ధనవంతుడయ్యాడనుకోండి! లేటెస్ట్‌గా ఎలాన్‌ మస్క్‌కు ఓ ఆలోచన వచ్చింది. అదేమిటంటే ప్రపంచంలోని ప్రముఖ నేతలు, ప్రముఖ కంపెనీల అధినేతలు ఫ్యాషన్‌ షోలో(Fashion show) పాల్గొంటే ఎలా ఉంటుంది? అని! వెంటనే తన ఆలోచనను కార్యరూపంలో పెట్టారు. దాని ఫలితమే కింద వీడియో! నిజానికి ఇది అసలు సాధ్యం కాదు. అయినప్పటికీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన కృత్రిమ మేథతో ఇది సాధ్యమయ్యింది. ఏఐ ఫ్యాషన్‌కు(AI fashion) ఇదే మంచి సమయం అంటూ ఓ వీడియోను తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు ఎలాన్‌ మస్క్‌. ఇప్పుడా వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోలో ఎవరెవరు ఉన్నారంటే రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Vladmir Putin), మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Narendra modi), అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌(Joe Bidden), అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధినేత జిన్‌పింగ్‌, కెనడా ప్రధాని ట్రుడో, అమెజాన్‌ అధినేత జఫ్‌ బేజోస్‌, ఫేస్‌బుక్‌ చీఫ్‌ మార్క్‌ జుకరబర్గ్‌, ప్రపంచ కుబేరుడు మస్క్‌, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఇలా ఒకరి వెంట ఒకరు ర్యాంప్‌ వాక్‌ చేస్తూ వస్తుంటారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story