సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు కొత్త సీఈఓ రానున్నారు. కంపెనీ ప్రస్తుత సీఈఓ, యజమాని ఎలోన్ మస్క్ ట్విట‌ర్‌ కంపెనీ కొత్త సీఈఓగా ఒక మహిళను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఆమె మరో 6 వారాల్లో కంపెనీలో చేరనుంది. ఇక‌పై మస్క్ ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉంటారు. ఎలోన్ మస్క్ చాలా కాలంగా ట్విట్టర్ కొత్త సీఈఓ కోసం వెతుకుతున్నారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌(Twitter)కు కొత్త సీఈఓ రానున్నారు. కంపెనీ ప్రస్తుత సీఈఓ, యజమాని ఎలోన్ మస్క్(Elon Musk) ట్విట‌ర్‌ కంపెనీ కొత్త సీఈఓగా ఒక మహిళను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఆమె మరో 6 వారాల్లో కంపెనీలో చేరనుంది. ఇక‌పై మస్క్ ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉంటారు. ఎలోన్ మస్క్ చాలా కాలంగా ట్విట్టర్ కొత్త సీఈఓ(New CEO) కోసం వెతుకుతున్నారు.

అయితే.. కొత్త సీఈవో పేరును మాత్రం మస్క్ ప్రకటించలేదు. అయితే.. వాల్ స్ట్రీట్ జర్నల్‌(Wall Street Journal)లోని ఒక నివేదిక ప్రకారం.. ఎన్‌బీసీ యూనివర్సల్ టాప్ అడ్వర్టైజింగ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయిన లిండా యాకారినో(Linda Yaccarino) ట్విట‌ర్ కొత్త సీఈఓ(Twitter News CEO) కావచ్చు. యాకారినో గత నెలలో మియామీలో జరిగిన ఒక అడ్వర్టైజింగ్ కాన్ఫరెన్స్‌లో మస్క్‌ని ఇంటర్వ్యూ(Interview) చేసింది. కాన్ఫరెన్స్‌లో యాకారినో మస్క్ పని తీరును కొనియాడారు.

ఎలోన్ మస్క్ ఈ ఏడాది ఫిబ్రవరి 15న మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరికల్లా ట్విట్టర్‌కు కొత్త సీఈవో రావ‌చ్చ‌ని ఆశిస్తున్నట్లు తెలిపారు. అనంత‌రం మస్క్ తన కుక్క ఫ్లోకి(Floki) ఫోటోలను ట్విట్టర్‌లో పంచుకున్నాడు. దానిని ట్విట్టర్ కొత్త సీఈవో అని సరదాగా పిలిచాడు. మస్క్ త‌న కున్న‌ ఫ్లోకి ఫోటోలను షేర్ చేస్తూ.. ట్విట‌ర్‌ కొత్త సీఈఓ అద్భుతమైనది. ఇది ఇతరుల కంటే చాలా బాగుంది. చాలా స్టైలిష్‌(Stylish)గా ఉంటుందని రాసుకొచ్చాడు.

Updated On 11 May 2023 10:07 PM GMT
Yagnik

Yagnik

Next Story