Katy Perry : విదేశాల్లో ప్రియురాలితో మాజీ ప్రధాని జల్సాలు..!
కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రుడో అమెరికన్ పాప్‌స్టార్ కేటీ పెర్రీతో డేటింగ్‌లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రుడో అమెరికన్ పాప్‌స్టార్ కేటీ పెర్రీతో డేటింగ్‌లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వీరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఇక తాజాగా ఈ జంట జపాన్‌లో విహరిస్తోంది. జస్టిన్ ట్రూడో 2023లో తన భార్య సోఫీ గ్రెగోయ్‌రీతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 18 ఏళ్ల వారి వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పారు. పలుమార్లు చర్చింకున్న తర్వాతే తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఇన్‌స్టాగ్రాం వేదికగా వెల్లడించారు. 2005, మే నెలలో జస్టిన్ ట్రుడో, సోఫీ గ్రెగోయ్‌రీ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం విడిపోతున్నప్పటికీ వారి సంరక్షణను తామిద్దరం కలిసే చూసుంటామని ట్రుడో దంపతులు వెల్లడించారు. ఎప్పటిలాగానే తమ మధ్య ప్రేమ, పరస్పర గౌరవం ఉంటాయని తెలిపారు. మరోవైపు జనవరి 2025లో ప్రధానమంత్రి పదవికి ట్రూడో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన బయట ప్రపంచానికి చాలా తక్కువగా కనిపిస్తున్నారు.


