లండన్‌(London)కు చెందిన ఓ మోడల్‌ కాలుజారింది.. కంగారుపడకండి.. కాలు జారడమంటే నిజంగానే జారిపడింది. ఫలితంగా ఆమె జీవితాంతం హీల్స్‌ ధరించలేని పరిస్థితి వచ్చింది. మనమైతే మన కర్మ ఇంతేనని గమ్మున ఊరుకుంటాం. ఆమె అలా కాదు.. సదరు షూ కంపెనీపై లక్ష పౌండ్ల నష్టపరిహారం కోసం కేసు వేసింది.

లండన్‌(London)కు చెందిన ఓ మోడల్‌ కాలుజారింది.. కంగారుపడకండి.. కాలు జారడమంటే నిజంగానే జారిపడింది. ఫలితంగా ఆమె జీవితాంతం హీల్స్‌ ధరించలేని పరిస్థితి వచ్చింది. మనమైతే మన కర్మ ఇంతేనని గమ్మున ఊరుకుంటాం. ఆమె అలా కాదు.. సదరు షూ కంపెనీపై లక్ష పౌండ్ల నష్టపరిహారం కోసం కేసు వేసింది. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు కోటి రూపాయలు. ఆషూ కంపెనీ(Ashu Company)కి చెందిన హీల్స్‌ వేసుకున్న కారణంగానే తాను ప్రమాదానికి గురయ్యానని ఆ మోడల్‌ వాదిస్తున్నారు. 31 ఏళ్ల క్లో మికెల్‌బరో 2018లో మిలన్‌లోని డిజైనర్‌ బేస్‌లో అడ్వర్‌టైస్‌మెంట్‌ షూట్‌లో పాల్గొన్నారు. వాక్‌వేపై నడుచుకుంటూ వెళుతున్నప్పుడు కాలు జారి పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆమె కాలి మడమ విరిగింది. భయంకరమైన నొప్పి, కాలువాపుతో ఆమె చాలా రోజుల పాటు మంచానికే పరిమితమయ్యారు. అలాగే ఇక జీవితంలో మళ్లీ హిల్స్‌ ధరించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో క్లో మికెల్‌బరో ఆ షూ కంపెనీపై నష్టపరిహారం కేసు వేయాలనుకున్నారు. వెంటనే కోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇకపై తాను ఎవరికీ డాన్స్‌ నేర్పించలేనని, డాన్స్‌ చేయలేనని, కనీసం పరుగెత్తే స్థితిలో కూడా లేనని న్యాయస్థానం ముందు మొరపెట్టుకున్నారు. అయితే ఆ షూను తయారు చేసిన స్టెల్లా మాక్‌కార్ట్‌నీ లిమిటెడ్‌ షూ కంపెనీ(Stella McCartney Shoe Company) మాత్రం క్లో మికెల్‌బరో చెప్పేవన్నీ అబద్ధాలంటోంది. ఆమె నడక మార్గంలో ప్రమాదం జరిగిందని, ఆమె తన బరువును నియంత్రించుకోలేక పడిపోయారని కంపెనీ తరపు న్యాయవాది మైఖేల్‌ పాట్రిక్‌(Michael Patrick) అంటున్నారు. ప్రస్తతం ఈ కేసు విచారణలో ఉంది.

Updated On 1 Nov 2023 2:14 AM GMT
Ehatv

Ehatv

Next Story