సాహసోపేతమైన బైక్‌ రైడింగ్‌తో(Bike riding) లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఓ మహిళా బైకర్‌(Female Bike rider) దుర్మరణం పాలయ్యారు.

సాహసోపేతమైన బైక్‌ రైడింగ్‌తో(Bike riding) లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఓ మహిళా బైకర్‌(Female Bike rider) దుర్మరణం పాలయ్యారు. తనకు ఇష్టమైన బైక్‌ నడుపుతూ ప్రమాదానికి గురయ్యారు. ప్రాణాలు కోల్పోయారు. రష్యాకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లెయెన్సర్‌ తత్యానా ఓజోలినా (Tatyana Ozolina) సాహసగాథ విషాదంగా ముగిసింది. తుర్కేయే (Turkey)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. బీఎండబ్ల్యూ బైక్‌పై ట్రావెలింగ్‌కు వెళ్లిన ఓజోలినా తుర్కియేలోని మిలాస్‌ ప్రాంతంలో కంట్రోల్‌ తప్పారు. ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టారు. ఈ దుర్ఘటనలో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. వెనుక కూర్చున్న తుర్కియే బైకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఓజోలినా బైక్‌ నడుపుతున్నప్పుడు ఎదురుగా మరో రైడింగ్‌ గ్రూప్‌ అడ్డుగా వచ్చిందని, ఆమె సడెన్‌గా బ్రేక్‌ వేయడంతో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. 38 ఏళ్ల ఓజోలినా మోటోతాన్యా పేరుతో బైక్‌ రైడింగ్‌పై వ్లాగ్‌లు చేస్తూ సోషల్‌ మీడియాలో బాగా పాపులరయ్యారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పది లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్‌ ఛానెల్‌కు 20 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story