పెళ్లంటే(Marriage) రెండు మనవులు, రెండు తనవులను కలిపే అపురూపబంధం. వైవాహిక వ్యవస్థను మనం గౌరవించేది అందుకే! మూడు ముళ్లు వేసి, ఏడు అడుగులు కలిసి నడిచిన తర్వాత జీవితాంతం ఆ బంధాన్ని నిలుపుకుంటామని మాట ఇచ్చిపుచ్చుకుంటారు.

పెళ్లంటే(Marriage) రెండు మనవులు, రెండు తనవులను కలిపే అపురూపబంధం. వైవాహిక వ్యవస్థను మనం గౌరవించేది అందుకే! మూడు ముళ్లు వేసి, ఏడు అడుగులు కలిసి నడిచిన తర్వాత జీవితాంతం ఆ బంధాన్ని నిలుపుకుంటామని మాట ఇచ్చిపుచ్చుకుంటారు. నాతిచరామి అని పురోహితులు చెప్పిస్తారు. ఇదంతా మన దగ్గరే! వెస్ట్రన్‌ కంట్రీస్‌కు వెళితే వందేళ్లు కలిసి బతకడమా? మా వల్ల కాదంటారు. అందుకే అక్కడ సెవెన్‌ ఇయర్స్‌ ఇచ్చింగ్‌ కల్చర్‌(Seven years eching culture) వచ్చింది. ఏడేళ్ల తర్వాత ఆలుమగలకు మొహంమొత్తుతుందట! బోర్‌ కొట్టేస్తుందట! మరో తోడు కోసం వెంపర్లాడుతుందట! మన దురదృష్టమేమిటంటే ఈ జాడ్యం నెమ్మదిగా మన దగ్గర కూడా వచ్చేస్తోంది. మన దగ్గర భార్యభర్తల మధ్య ఓ బాండింగ్‌ ఉంటుంది. ఒకరికొకరమనే భావన ఉంటుంది. కష్టా సుఖాలను కలిసి పంచుకోవాలనే తలంపు ఉంటుంది. అందుకే కలిసి ఉండగలుగుతున్నారు. ఒక్కసారి దంపతుల మధ్య సాన్నిహిత్యం తగ్గడం మొదలైతే, అది విడిపోవడానికి దారి తీస్తుంది. పెళ్లికి ముందు అందరూ ఎవరో ఒకరిని ప్రేమించే ఉంటారు. చాలా మందికి ప్రేమ ఫలించదు. ఒకవేళ ఫలించే అవకాశాలున్నా తల్లిదండ్రుల మాట కాదనలేక వారు చూసిన సంబంధాన్నే చేసుకుంటారు. పాత జ్ఞాపకాలు తరుముకురాకుండా జాగ్రత్తపడతారు. భాగస్వామితో బహుచక్కగా ఉంటారు. ఇలా చక్కగా సాగిపోతున్న దాంతప్య జీవితంలోకి అకస్మాత్తుగా మాజీ లవర్(Ex-lover) వచ్చేస్తారు. అప్పట్నుంచి మెదడులో పురుగు తొలుస్తుంటుంది. వారిని కలవాలని, వారితో కలిసి ఉండాలనే కోరిక జనియిస్తుంది. ఇలాంటివే వివాహేతర సంబంధాలకు దారి తీస్తుంటాయి. ఎక్కువ మట్టుకు కాపురాలు కూలిపోయేది భర్తల అహంభావం వల్లే! ఎంత సర్దుకుపోదామనుకున్నా భార్యలకు కానిపనిగా మారతుంటుంది. వివాహబంధాన్ని భారంగా మోస్తూ, బాధపడుతూ ఉంటుంటారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు లావా పొంగుతుంది. కట్టుకున్నవాడిని కాదనేసి బయటకు వచ్చేస్తారు. ఇలా కూడా దాంపత్యాలు విచ్ఛిన్నమవుతుంటాయి. మనిషన్నవాడికి కోరికలు ఉంటాయి. అందరూ కోరికలను త్యజించలేరు. మగవాళ్లు బయటకు చెప్పుకోగలరుగుతారు, ఆడవాళ్లకు ఈ సౌలభ్యం ఉండదు. ఒకవేళ మనసులో మాట చెప్పినా భర్తకు బోల్డన్ని అనుమానాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో ఒకరికొకరు తమ మనసులో ఉన్నది చెప్పేసుకోవాలి. శృంగారజీవితాన్ని ఎంజాయ్‌ చేయాలి. అప్పుడు ఆలుమగలు అరమరికలు లేకుండా కలకాలం ఒక్కటిగా ఉండగలరు. లేకపోతే ఆ బంధం తెగిపోయే అవకాశం ఉంది.

Eha Tv

Eha Tv

Next Story