డొనాల్డ్ ట్రంప్‌ తన భార్య మెలానియాతో కలిసి డాన్సులు చేశారు.

డొనాల్డ్ ట్రంప్‌ తన భార్య మెలానియాతో కలిసి డాన్సులు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్‌ పార్టీ (Republic Party)అభ్యర్థి అయిన ట్రంప్‌ ఆదివారం రాత్రి న్యూయార్క్‌(New York)లో జరిగిన మాడిసన్‌ స్క్వెర్‌ గార్డెన్‌(Madison Square Garden) ర్యాలీ వేదికపై ఆయన సందడి చేశారు. వేదికపైకి ట్రంప్‌ రాక మునుపు మెలానియా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ట్రంప్‌(Donald Trump) వేదికపైకి రాగానే ఆయనను ఆలింగనం చేసుకుని ముద్దుపెట్టారు. ఇద్దరు కలిసి డాన్సులు చేశారు. మేక్‌ అమెరికా గ్రేట్ అగెయిన్‌ (Make America Great Again)అంటూ నినాదాలు కూడా చేశారు. నవంబర్‌ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకు ట్రంప్‌దే పైచేయి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ట్రంప్‌ క్రేజ్‌ పెరుగుతున్నదని సర్వేలు చెబుతున్నాయి. నెల రోజుల కిందటకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పుడు డెమొక్రాట్‌ అభ్యర్థి కమలా హారిస్‌(Kamala Harris) కాసింత ముందంజలో ఉన్నారు. ఇప్పుడు ట్రంప్‌దే అప్పర్‌ హ్యాండ్‌ అయ్యింది.

Updated On
ehatv

ehatv

Next Story