ఫ్రాన్స్‌లో హింస ప్రజ్వరిల్లుతోంది. పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు చనిపోయిన ఘటన ఫ్రాన్స్‌ను అల్లకల్లోలం చేస్తోంది. నిరసనకారులు పెద్ద ఎత్తున విధ్వంసాలకు పాల్పడుతున్నారు. షాపులు తగలబడిపోతున్నాయి. మాల్స్‌ను దోచుకుంటున్నారు. రోడ్లను బ్లాక్‌ చేస్తున్నారు. మరోవైపు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్(Emmanuel Macron) మాత్రం మ్యూజిక్‌ కన్సర్ట్‌లో పాల్గొని వివాదంలో కూరుకుపోయారు.

ఫ్రాన్స్‌లో హింస ప్రజ్వరిల్లుతోంది. పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు చనిపోయిన ఘటన ఫ్రాన్స్‌ను అల్లకల్లోలం చేస్తోంది. నిరసనకారులు పెద్ద ఎత్తున విధ్వంసాలకు పాల్పడుతున్నారు. షాపులు తగలబడిపోతున్నాయి. మాల్స్‌ను దోచుకుంటున్నారు. రోడ్లను బ్లాక్‌ చేస్తున్నారు. మరోవైపు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్(Emmanuel Macron) మాత్రం మ్యూజిక్‌ కన్సర్ట్‌లో పాల్గొని వివాదంలో కూరుకుపోయారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌ కావడంతో జనం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారిస్‌లో జరిగిన బ్రిటిష్‌ సింగర్‌(British singer) ఎల్టాన్ జాన్(Elton John) సంగీత కచేరికి మాక్రాన్‌, ఆయన భార్య హాజరయ్యారు. 'ఆందోళనకారులు ఫ్రాన్స్‌ నగరాలలో విధ్వంసం సృష్టిస్తుంటే అధ్యక్షుడేమో మ్యూజిక్‌ కన్సర్ట్‌లో ఉన్నారు. అక్కడ భార్యతో డాన్స్‌లు చేశారు' అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. నిజానికి ఈ సంగీత కచేరి బుధవారం జరిగింది. అప్పటికీ ఫ్రాన్స్‌లో ఘర్షణలు ఇంత ఉద్ధృతంగా లేవు. కాకపోతే ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ కావడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తను అధికారంలో ఉన్నప్పుడు ఓ యువకుడు చనిపోతే, మాక్రాన్‌ మాత్రం సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది సరికాదు అని ఓ నెటిజన్‌ ఆవేదన చెందాడు. 'హింసాత్మక ఘటనలు జరుగుతున్నప్పుడు మాక్రాన్‌ తన హోం మంత్రికి అండగా ఉండకుండా ఎల్టాన్‌ను మెచ్చుకోవడానికే మెగ్గుచూపారు' అని ఒకరు కామెంట్‌ చేశారు. .ఇదిలా ఉంటే.. హింసాత్మక ఘటనలపై శుక్రవారం మేక్రాన్‌ దేశ ప్రజలతో మాట్లాడారు. దేశంలో అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు యువతను ఇంటిపట్టునే ఉండేలా చూడాలని తల్లిదండ్రులకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించాలంటూ అధికారులకు సూచించారు.

Updated On 1 July 2023 4:37 AM GMT
Ehatv

Ehatv

Next Story