చాలామందికి నిద్రపోయేటప్పుడు గురక పెట్టే అలవాటు ఉంటుంది .వయసుతో సంబంధం లేకుండా ఉండే ఈ అలవాటు చాలా మందిని వేధిస్తుంది . కానీ నిజానికి గురకపెట్టె వారికీ ఈ విషయం తెలియదు .వారి పక్కన ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ గురక వల్ల అసలు ఇబ్బంది కలుగుతుంది . ఇలానే తన ప్రియుడు గురుక పెట్టడంతో విసిగిపోయిన ప్రియురాలు చేసిన పని తెలిస్తే షాకవుతారు . బాయ్ ఫ్రెండ్ గురకతో బోలెడంత సంపాదిస్తుంది . ఎలా అంటే ?

చాలామందికి నిద్రపోయేటప్పుడు గురక(snore) పెట్టే అలవాటు ఉంటుంది .వయసుతో సంబంధం లేకుండా ఉండే ఈ అలవాటు చాలా మందిని వేధిస్తుంది . కానీ నిజానికి గురకపెట్టె వారికీ ఈ విషయం తెలియదు .వారి పక్కన ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ గురక వల్ల అసలు ఇబ్బంది కలుగుతుంది . ఇలానే తన ప్రియుడు గురుక పెట్టడంతో విసిగిపోయిన ప్రియురాలు చేసిన పని తెలిస్తే షాకవుతారు . బాయ్ ఫ్రెండ్ గురకతో బోలెడంత సంపాదిస్తుంది . ఎలా అంటే ?

లూయిస్‌ (luis) 33, అనా మల్ఫెయిర్(anaa malfair)(26) ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు . వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. లూయిస్ కి వీపరీతంగా గురక పెట్టే అలవాటు ఉంది. అతని గురకతో (snoring)విసిగిపోయిన అనా .. లూయిస్ కి గురక విషయం చెప్పింది . మొదట్లో ఈ విషయం అతను నమ్మలేదు . దానితో ప్రియురాలు అనా ఒక రోజు రాత్రి లూయిస్ గురకను రికార్డు చేసి వినిపించింది . మరుసటి రోజు లూయిస్ అది విని ఎంతగానో సిగ్గు పడ్డాడు . అనా మాత్రం లూయిస్ గురకతో నిద్రలేక ఏమి తోచక అతని గురకను రోజు రికార్డు చేయటం మొదలు పెట్టింది . ఇలా సంవత్సరం పాటు చేసింది. ఇంతలో ఆమెకు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది . తన దగ్గర ఉన్న వివిధ రకాల గురక సౌండ్స్ ని అమ్మి డబ్బు సంపాదించాలి అనుకుంది .

అనా కి వచ్చిన ఆలోచనతో తన దగ్గర ఉన్న గురక శబ్దాలను స్నేహితులైన మ్యూజిక్ డైరెక్టర్స్ కు వినిపించింది అన్నా. అందులో ఒకరు ఆమెకు ఐడియా ఇచ్చారు. Spotify లో వీటిని అప్లోడ్ చేయమని చెప్పారు.దానితో spotify లో ఈ గురక కలెక్షన్స్ ని అప్లోడ్ చేయగా నెమ్మదిగా యూజర్స్ అనా గురక కలెక్షన్స్ వినటం మొదలు పెట్టారు . దాంతో అనా డబ్బు సంపాదించటం మొదలు పెట్టింది .ఒకప్పుడు తన బాయ్‌ఫ్రెండ్ పెట్టిన గురకతో ఇబ్బంది పడిన అన్నా ఇప్పుడు ఎంతో ఇష్టంగా వింటుంది. Spotify ఖాతాలోని ఈ గురక సంగీతాన్ని వింటున్న వారి సంఖ్య దాదాపు ఇప్పుడు 16 వేలు వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నీ అనా మల్ఫెయిర్ (26) తన ఫేస్బుక్(facebook) అకౌంట్ ద్వారా తెలియజేసింది .

Updated On 24 April 2023 5:44 AM GMT
rj sanju

rj sanju

Next Story