తిన్నదరక్క కొట్టుకునేవాళ్లు కోకొల్లలుగా ఉంటారు. కానీ వీరు మాత్రం తింటున్నప్పుడే తెగకొట్టేసుకున్నారు. అది కూడా ఓ పెళ్లి వేడుకలో.. ఇది జరిగింది పాకిస్తాన్‌లో(Pakistan)! ఫంక్షన్‌కు వచ్చిన వారు పొట్టుపొట్టు కొట్టుకున్నారు. కుర్చీలను, ప్లేట్లను ఒకరిపై ఒకరు విసురుకున్నారు. అసలేం జరిగిందంటే వేడుకకు వచ్చిన అతిథులంతా చక్కగా భోజనం చేస్తున్నారు.

తిన్నదరక్క కొట్టుకునేవాళ్లు కోకొల్లలుగా ఉంటారు. కానీ వీరు మాత్రం తింటున్నప్పుడే తెగకొట్టేసుకున్నారు. అది కూడా ఓ పెళ్లి వేడుకలో.. ఇది జరిగింది పాకిస్తాన్‌లో(Pakistan)! ఫంక్షన్‌కు వచ్చిన వారు పొట్టుపొట్టు కొట్టుకున్నారు. కుర్చీలను, ప్లేట్లను ఒకరిపై ఒకరు విసురుకున్నారు. అసలేం జరిగిందంటే వేడుకకు వచ్చిన అతిథులంతా చక్కగా భోజనం చేస్తున్నారు. మగవారికి ఓ వైపు, ఆడవారికి ఓ వైపు భోజన ఏర్పాట్లు చేశారు. సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ భోం చేస్తున్నారు. ఇదే సమయంలో ఓ వ్యక్తి వచ్చి తింటున్న మరో వ్యక్తి టోపీని తిప్పాడు. అతడెందుకు అలా చేశాడో ఏమో కానీ భోం చేస్తున్న వ్యక్తికి మాత్రం చెడ్డ కోపం వచ్చింది. గొడవ మొదలయ్యింది. అది పెద్దయ్యింది. అతిథులు రెండు వర్గాలుగా విడిపోయారు. అంతే.. అక్కడ పెద్ద యుద్ధమే జరిగింది. ఆ గొడవను ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అంతే నిమిషాల్లో అది వైరల్‌ అయ్యింది. ఈ వీడియోపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Updated On 1 Sep 2023 5:31 AM GMT
Ehatv

Ehatv

Next Story