harvard university : హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా..! అట్టుడుకుతున్న వర్సిటీలు!
అమెరికా(America)లోని విశ్వవిద్యాలయాలలో పాలస్తీనా అనుకూల నిరసనలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. భారత్(India)తో పాటు చాలా దేశాల విద్యార్థులు పాలస్తీనాకు సంఘీభావంగా, మద్దుతుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. శిబిరాలు ఏర్పాటు చేసుకుని దీక్షలు చేస్తున్నారు.

harvard university
అమెరికా(America)లోని విశ్వవిద్యాలయాలలో పాలస్తీనా అనుకూల నిరసనలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. భారత్(India)తో పాటు చాలా దేశాల విద్యార్థులు పాలస్తీనాకు సంఘీభావంగా, మద్దుతుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. శిబిరాలు ఏర్పాటు చేసుకుని దీక్షలు చేస్తున్నారు. కొలంబియా యూనివర్సిటీ(Columbia University)లో మొదలైన నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలకు పాకాయి. ఆందోళనకారులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నా, యూనివర్సిటీల అధికారులు విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నా నిరసనకారులు లెక్క చేయడం లేదు. లేటెస్ట్‌గా హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University)లో నిరసనకారులు పాలస్తీనా జెండాను ఎగురవేశారు. జాన్ హార్వర్డ్ విగ్రహం(John Harvard Statue)పై పాలస్తీనా జెండా రెపరెపలాడటం కలకలం సృష్టిస్తోంది. నిజానికి ఆ ప్లేస్‌లో అమెరికా జెండా మాత్రమే ఎగరాలి. ఎవరైనా విదేశీ ప్రతినిధులు వస్తే వారి దేశ జెండాలను మాత్రం అక్కడ ఉంచుతారు. నిరసనకారులు అమెరికా జెండాను పక్కనపెట్టేసి ఆ ప్లేస్‌లో పాలస్తీనా జెండా ఎగరేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. గాజాపై ఇజ్రాయెల్ పదే పదే దాడులు చేస్తూ అమాయక జనాన్ని పొట్టన పెట్టుకుంటోంది. హాస్పిటల్స్‌ను కూడా వదలడం లేదు. గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌తో అమెరికా ఆర్ధిక సంబంధాలను తెంచుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. పాలస్తీనాకు విముక్తి కల్పించాలంటున్నారు. ఈ నిరసనల సెగలు వైట్‌హౌస్‌ను కూడా తాకాయి. బైడెన్ వైట్ హౌస్(Biden White House)లో ఇచ్చే ఎన్నికల ఏడాది విందుకు జర్నలిస్టులు, రాజకీయనాయకులు, సెలబ్రిటీలు హాజరవ్వడాన్ని నిరసనకారులు తప్పుపట్టారు.
