మార్చి ఎనిమిదిన, అంటే ఇవాళ మనమంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(International Women's Day) జరుపుకుంటున్న విషయం తెలిసిందే! ఈ సందర్భంగా మహిళలకు సంబంధించి ఓ విశేష కథనాన్ని చూద్దాం. వాటికన్‌ సిటీ(Vatican City)లో ఆడవాళ్లు ఉండరు. అక్కడంతా మగవాళ్లదే రాజ్యం! ఆ మాటకొస్తే సగభాగం ఆడవాళ్లు ఉన్న చోట కూడా మగవాళ్లదే కదా పెత్తనం!

మార్చి ఎనిమిదిన, అంటే ఇవాళ మనమంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(International Women's Day) జరుపుకుంటున్న విషయం తెలిసిందే! ఈ సందర్భంగా మహిళలకు సంబంధించి ఓ విశేష కథనాన్ని చూద్దాం. వాటికన్‌ సిటీ(Vatican City)లో ఆడవాళ్లు ఉండరు. అక్కడంతా మగవాళ్లదే రాజ్యం! ఆ మాటకొస్తే సగభాగం ఆడవాళ్లు ఉన్న చోట కూడా మగవాళ్లదే కదా పెత్తనం! ఈ సంగతి అటుంచితే వాటికన్‌ సిటీకి కంప్లీట్‌గా రివర్స్‌గా ఉంటుంది చైనా(China)లోని సెరెనె వ్యాలీ(Serene Valley)! హిమాలయాల్లో ఉన్న ఆ వ్యాలీలో మొసో పేరుతో ఓ గిరిజన తెగ ఉంది. అక్కడంతా మహిళలే! మగవాళ్లు లేరు కాబట్టే సంతోషంగా, ఆనందంగా నివసిస్తున్నారు వారు. మొసో మహిళలు పెళ్లిళ్లు అస్సలు చేసుకోరు. తమ జీవితాల్లోకి ఛస్తే పురుషులను రానివ్వరు. రానిస్తే జీవితాంతం చస్తూ బతకాల్సి వస్తుందని కాబోలు అంత గట్టి నిర్ణయం తీసుకున్నారు. లుగు అనే చెరువు చుట్టుపక్కల ఉన్నదంతా మొసో మహిళల రాజ్యమే! అక్కడ ఎవరి అధికారాలూ పని చేయవు. మొసో మహిళలు తమ నిర్ణయాలను తామే తీసుకుంటారు. అందరూ కలిసి ఓ సొసైటీగా ఏర్పడ్డారు. తమ సమాజంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా అందరూ సాయపడతారు. అందుకే వారికి ఏ కష్టమూ ఉండదు. పెళ్లికి దూరంగా ఉండాలన్న కఠిన నిర్ణయం వీరెందుకు తీసుకున్నారబ్బా అనే క్వొశ్చన్‌ రాకుండా ఎలా ఉంటుంది..? దానికో ఆన్సర్‌ ఉంది.. అప్పుడెప్పుడే ఈ తెగకు చెందిన ఓ పదమూడేళ్ల అమ్మాయి పెళ్లి చేసుకుని నానా కష్టాలు పడిందట! చివరకు విడాకులు తీసుకుంటే కానీ కష్టాల నుంచి ఆమె బయటపడలేదట! అంతే అప్పట్నుంచి ఈ తెగవారికి పెళ్లంటేనే అసహ్యమేసింది. సంతానం కోసం పేదవాళ్లు ఎవరైనా ఆడపిల్లలను ఇస్తే సొంత బిడ్డలా సాకుతారు. వారినే తమ పిల్లలుగా భావిస్తారు.. వాళ్ల బరువు బాధ్యతలన్నీ చూసుకుంటారు..

Updated On 8 March 2024 1:32 AM GMT
Ehatv

Ehatv

Next Story