ఓ మహానగరానికి నిద్రపట్టకుండా చేస్తున్నదో పిల్లి(Cat). ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఆ నగర ప్రజలు వణికిపోతున్నారు. ఆ మార్జాలానికి ఎందుకంత హడడెల్తిపోతున్నారంటే ఆ పిల్లి ప్రమాదకరమైన రసాయనాల ట్యాంకులో(Chemicals Tank) పడటమే. పడితే పడింది.. దానికెందుకంత గాభరా అంటే.. ఆ పిల్లి కేన్సర్‌ కారక రసాయనాన్ని అంతటా వెదజల్లుతుందేమోనన్న భయం..జపాన్‌(Japan ) హిరోషిమాలోని(Hiroshima) ఫుకుయామాలో జరిగిందీ ఘటన.

ఓ మహానగరానికి నిద్రపట్టకుండా చేస్తున్నదో పిల్లి(Cat). ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఆ నగర ప్రజలు వణికిపోతున్నారు. ఆ మార్జాలానికి ఎందుకంత హడడెల్తిపోతున్నారంటే ఆ పిల్లి ప్రమాదకరమైన రసాయనాల ట్యాంకులో(Chemicals Tank) పడటమే. పడితే పడింది.. దానికెందుకంత గాభరా అంటే.. ఆ పిల్లి కేన్సర్‌ కారక రసాయనాన్ని అంతటా వెదజల్లుతుందేమోనన్న భయం..జపాన్‌(Japan ) హిరోషిమాలోని(Hiroshima) ఫుకుయామాలో జరిగిందీ ఘటన. ఇప్పుడా పిల్లి కోసం అధికారులు వెదుకుతున్నారు. పెట్రోలింగ్‌ను బాగా పెంచారు. ఆ పిల్లి ఆచూకి చెప్పాలంటూ ప్రజలకు విజ్ఞప్తులు చేశారు. ఆ పిల్లితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆ పిల్లి చివరిసారిగా రసాయన కర్మాగారం నుంచి బయటపడినట్టు సెక్యూరిటీ ఫుటేజ్‌లో కనిపించింది. ఆ పిల్లి అడుగుజాడలను ఓ కార్మికుడు గుర్తించాడు. వెంటనే ఉన్నతాధికారులకు తెలిపాడు. అప్పట్నుంచి వారిలో వణుకు మొదలయ్యింది. ఎందుకంటే ఆ పిల్లికి అంటుకున్న రసాయనం అత్యంత ప్రమాదకరమైనది. దాన్నిముట్టుకున్నా, పీల్చినా వెంటనే శరీరంపై దద్దుర్లు, వాపు వస్తాయి. తీవ్రవ్యాధికి దారి తీస్తుంది. ఆ పిల్లి ఇంకా బతికి ఉందో లేదో కూడా తెలియదు. ఫ్యాక్టరీలో రసాయన వ్యాట్‌ను కప్పి ఉంచే షీట్‌ చాలా మట్టుకు చిరిగిపోయిందట. పొరపాటున అందులో పడిన పిల్లి తర్వాత ఎటో వెళ్లిపోయింది. సాధారణంగా పిల్లులు తమ శరీరాన్ని నాకుతూ ఉంటాయి. ఆ లెక్కన ఆ పిల్లి ఆ రసాయనాన్ని ఇప్పటికే నాకి చనిపోయి ఉంటుందని రసాయన ప్రమాద అంచనాలో నిపుణురాలు లిండా షెంక్‌ అంటున్నారు.

Updated On 14 March 2024 4:44 AM GMT
Ehatv

Ehatv

Next Story