నిద్రపోతున్న యజమాని కాలి బొటనవేలు పూర్తిగా కోరికేసింది అతని పెంపుడు కుక్క .అది చూసిన అతని భార్య భయంతో కేకలు వేసింది .అది విని నెమ్మదిగా కళ్ళు తెరిసిన ఆమె భర్తకు కళ్లెదుట తన పెంపుడు కుక్క నోట్లో అతని కాలి బోటనవేలు గోరు వేలాడుతూ కనిపించింది . ఏమైందా? అంటూ నెమ్మదిగా కిందకు చూసాడు .ఇంకేముంది రక్తంతో తడిసిన సగం నమిలేసిన అతని బొటనవేలుని చూసి భయంతో హాస్పిటల్ కు పరుగు పెట్టాడు . ఎక్కడంటే ?

UK లో 64 ఏళ్ళ రిటైర్డ్ బిల్డర్(retired builder )డేవిడ్ లిండ్సే(David Lindsay’s )తన పెంపుడు కుక్కతో ఎంతో ప్రేమగా ఉండేవాడు . 7నెలల వయస్సు ఉన్న ఆ బుల్ డాగ్ (Bull Dog)పేరు హార్లే(Harley) .. సోఫాలో నిద్రపోతున్న యజమాని కాలు ఎముక బయటకు వచ్చే మాదిరి కోరికేసింది . అది చూసి భార్య భయపడి కేకలు వేసేసరికి ఏమై ఉంటుందో లేచి చూసాడు . కాలి బొటనవేలు అంత దారుణంగా నమిలేసిన అతనికి తెలియకపోవటంతో హాస్పిటల్ కి వెళ్ళాడు . డాక్టర్లు అతనికి మధుమేహం ఉందని చెప్పగా షాక్ అయ్యాడు . శరీరంలో రెండు దమనులు మూసుకుపోవడం వల్ల కాళ్లకు రక్తం సరిగా సరఫరా అవ్వక పోవడంవల్ల అతని కాళ్లు పూర్తిగా తిమ్మిర్లు ఎక్కాయి .అందుకే కుక్క గాయం చేస్తున్నా..తనకు స్పర్శ తెలియలేదని, వెల్లడించారు వైద్యులు.తన కుక్క గాయం చేయడం వల్లే తన అనారోగ్యం విషయం తెలిసినందుకు తెగ సంబర పడిపోయాడు ఆ యజమాని .

గాయం తరువాత ఆసుపత్రిలో జాయిన్ అయిన డేవిడ్ లిండ్సే(David Lindsay’s )సుమారు తొమ్మిది రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం డిశ్చార్జ్‌ అయ్యాడు. గాయం కారణంగా వచ్చిన ఇన్ఫెక్షన్ తగ్గకపోవడంతో అతని బొటన వేలును పూర్తిగా తొలగించారు డాక్టర్లు . ప్రస్తుతం కుక్కకాటు వలన కలిగే ఇన్ఫెక్షన్ కి కూడా ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ని కూడా డేవిడ్ కి అందిస్తున్నారు వైద్యులు .

Updated On 22 April 2023 2:30 AM GMT
rj sanju

rj sanju

Next Story